దావూద్ ఇబ్రహీం క్లోజ్: రూ. వేల కోట్ల సామ్రాజ్యానికి కింగ్ ఎవరూ ? ఛోటా లాజిక్ ఇదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలోని ఆగా ఖాన్ ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. అయితే అతను బతికే అవకాశం చాల తక్కువగా ఉందని తెలిసింది. దావూద్ ఇబ్రహీం అనారోగ్యంతో ఉన్నారని వార్తలను ఆయన ముఖ్య అనుచరుడు ఛోటా షకీల్ ఖండించాడు.

అయితే భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం దావూద్ ఇబ్రహీం వారసుడు ఎవరూ ? అనే ప్రశ్న తెరమీదకు రావడంతోనే ఛోటా షకీల్ దావూద్ అనారోగ్యం వార్తలను ఖండిస్తున్నాడని వెలుగు చూసిందని సమాచారం. దావూద్ వారసుడి విషయం తెరమీదకు వస్తే లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఛోటా షకీల్ ఇలా నాటకాలు ఆడుతున్నాడని భారత నిఘా వర్గాలు అంటున్నాయి.

మృత్యువుతో పోరాడుతున్న దావూద్ ?

మృత్యువుతో పోరాడుతున్న దావూద్ ?

దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ స్టర్ అనే విషయం ప్రపంచానికికే తెలుసు. దావూద్ ఇబ్రహం అంతర్జాతీయ నేరస్తుడు అని ఇప్పటికే ప్రకటించారు. దావూద్ ఇబ్రహీం అనారోగ్యానికి గురై మృత్యువుతో పోరాడుతున్నాడని వెలుగు చూసింది.

దావూద్ ఇబ్రహీం సామ్రాజ్యం

దావూద్ ఇబ్రహీం సామ్రాజ్యం

దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యం 6.7 బిలియన్ అమెరికన్ డాలర్లు విస్తరించి ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యానికి వారసుడు ఎవరు ? అనే విషయం అర్థం కావడం లేదని భారత నిఘా వర్గాలు అంటున్నాయి.

ఫోబ్స్ జాబితాలో దావూద్ ఇబ్రహీం

ఫోబ్స్ జాబితాలో దావూద్ ఇబ్రహీం

దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యం ఎంత వరకు ఎదిగిందంటే ఫోబ్స్ జాబితాలో స్థానం సంపాధించే వరకు వెళ్లింది, 2015 ఫోబ్స్ జాబితాలో దావూద్ ఇబ్రహీం నేర సామ్రజ్యం 6.7 బిలియన్ అమెరికన్ డాలర్లు విస్తరించి ఉందని ప్రకటించింది.

అందుకోసమే ఆలస్యం

అందుకోసమే ఆలస్యం

దావూద్ ఇబ్రహీం ప్రాణాలతో లేరని, ఆయన ఆరోగ్యం విషమించిందని వెలుగు చూస్తే ప్రత్యర్థులు విరుచుకుపడే అవకాశం ఉందనే, అలాంటి వాటికి అస్కారం ఇవ్వరాదని ఛోటా షకీల్ నాటకాలు ఆడుతున్నారని, పాక్ మీడియా వార్తలను ఖండించారని సమాచారం.

దావూద్ ఇబ్రహీం వ్యాపారాలు

దావూద్ ఇబ్రహీం వ్యాపారాలు

భారత నిఘా వర్గాల అధికారుల కథనం మేరకు దావూద్ ఇబ్రహీం వజ్రాలు, డ్రగ్స్, మారణాయుధాల వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారంతో పాటు క్రికెట్ బెట్టింగ్, నకిలీ నోట్లు దందా కూడా చేస్తున్నాడని వెలుగు చూసింది.

ఇప్పుడు

ఇప్పుడు

దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఉన్నాడా ? చచ్చాడా ? అనే ప్రశ్న మొదలైయ్యింది. నేరసామ్రజ్యంలోని డాన్ లు అందరూ ఇదే విషయంపై చర్చ మొదలు పెట్టారు. దావూద్ ఇబ్రహీం లాంటి నీచుడు చనిపోయాడని వార్త అధికారికంగా వినాలని చాల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు.

దావూద్ ఇబ్రహీంకు వీరంటే

దావూద్ ఇబ్రహీంకు వీరంటే

దావూద్ ఇబ్రహీం ఇద్దరినే ఎక్కువ నమ్ముతాడు. తన సొంత తమ్ముడు అనీస్, ఛోటా షకీల్ ను మాత్రమే దావూద్ ఇబ్రహీం ఎక్కువగా నమ్ముతాడు. మిగిలిన వారిని దూరం పెడుతాడు. ఇప్పుడు అనీస్, ఛోటా షకీల్ లో ఎవరూ పగ్గాలు చేపడుతారు ? అని అందూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వీరిదే అంతిమ తీర్పు

వీరిదే అంతిమ తీర్పు

దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యానికి ఎవ్వరు వారసులు అనే విషయం పాకిస్థాన్ లోని ఐఎస్ఐ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యాన్ని ఇక ముందు ఐఎస్ఐ నిర్ణయించిందని తెలిసింది.

దావూద్ ఫ్యామిలీనే ?

దావూద్ ఫ్యామిలీనే ?

దావూద్ ఇబ్రహీం నేర సామ్రాజ్యాన్ని ఆయన కుటుంబ సభ్యులే చూసుకుంటారని సమాచారం. గత రెండేళ్ల నుంచి ఆనారోగ్యంతో ఉన్న దావూద్ ఇబ్రహీం తన శిష్యుడు ఛోటా షకీల్ సహాయంతో వ్యాపారాలు చూసుకోవాలని తన తమ్ముడు అనీస్ కు సాచించాడని వెలుగు చూసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
D-It is almost certain that Dawood Ibrahim who is undergoing treatment at the Aga Khan hospital in Karachi will not make it. Intelligence Bureau officials say that Shakeel would try and keep the issue under wraps because in such times a succession issue would crop up.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి