వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దానోత్సవం: ఒకరికి సహాయం చేద్దాం... వారి జీవితాల్లో వెలుగు నింపుదాం

|
Google Oneindia TeluguNews

దాన ఉత్సవం అనేది భారతదేశంలో ఒక వేడుకలా జరుపుకుంటాం. దానం అంటే ఇవ్వడం అని అర్థం. ప్రతి ఏటా అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఈ దానోత్సవాలు జరుగుతాయి. ఒక వ్యక్తికి మేలు చేకూరేలా అతనికి లేదా ఆమెకు మనదగ్గరున్న దానిలో కొంత అంటే డబ్బు, వస్తువులు, ప్రతిభ, లేదా సమయం లాంటివి వారికి కేటాయించి దానం చేయడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. దాన్ అనే పదం పాలి లేదా సంస్కృతం నుంచి వచ్చినది. ఔదార్యం యొక్క ధర్మం అని దీనర్థం. మనరోజూవారీ కార్యక్రమాలతో లేదా బిజీగా ఉండటం వల్ల కుటుంబసభ్యులకే సమయం కేటాయించలేకపోతున్నాం. అదే సమయంలో కొందరు ఆదర్శవంతుల కథలు కూడా చదువుతున్నాం. వారు కూడా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి కొంత సమయం కేటాయిస్తున్నారు. అదేసమయంలో సమాజ హితం కోసం వారికి తోచినంత సహాయం లేదా సేవ చేస్తున్నారు.

దానోత్సవం అంటేనే ఇతరుల కోసం పాటుపడటం. ఇతరులకు సేవ చేయడంలోకానీ సహాయం చేయడంలోకానీ ఎంతో ఆనందం దాగి ఉంది. ఒకరి ముఖంలో చిరునవ్వు చూస్తే ఎంతో తృప్తి కలుగుతుంది. ఇది ఒక సంస్థ కాదు.. కానీ ఇది దానం చేయడం వల్ల కలిగే ఆనందాన్ని దేశవ్యాప్తంగా తెలియజెప్పడమే. గత పదేళ్లుగా దానోత్సవాలు చాలా మందికి ఆదర్శంగా నిలిచాయి. కేవలం ఒక చిన్న ఐడియాతో మొదలై ఇప్పుడు ఒక ఉద్యమంలా సాగుతోంది. దానోత్సవంలో చాలా కార్పోరేట్ కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. అంతేకాదు స్కూళ్లు, కాలేజీలు, ఎన్జీఓలుచ ప్రభుత్వ శాఖలు ఇలా చాలా స్వచ్చంధంగా పాల్గొంటున్నాయి. ఇందులో భాగంగానే 'గివింగ్ ట్యూస్‌డే'ను పాటిస్తున్నారు. దానోత్సవ్ వారోత్సవాల్లో భాగంగా దీన్ని మంగళవారం నాడు పాటిస్తున్నారు.

DaanUtsav:Indias own festival that celebrates giving

మహాత్మాగాంధీ 150వ జయంతి కూడా మంగళవారమే వస్తోంది. గాంధీ కూడా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని పిలుపునిచ్చారు. గివింగ్ ట్యూస్‌డే కార్యక్రమం గాంధీ జయంతి రోజునే జరుపుకోవడం మరింత ఆనందాన్నిస్తుంది. ఇంతకంటే మంచి తరుణం ఇంకేముంటుంది. ఈ ఏడాది కూడా దానోత్సవాల్లో పాల్గని మీ కుటుంబ సభ్యులను, మీ మిత్రులను, పొరిగువారిని, సహోద్యోగులను ఇందులో భాగం చేయాలని కోరుచున్నాం. ఏదైతే మీరు దానం చేస్తున్నారో అందులో సంతోషం పొందుతారు. వృద్ధులతో సమయం గడపడం, పుస్తకాలు ఇవ్వడం, బొమ్మలు ఇవ్వడం లాంటి చిన్నపనులతో చాలామంది ముఖాల్లో చిరునవ్వు తీసుకురావచ్చు.

ఒడిషాలోని బదాంబా ప్రాంతానికి చెందిన రిక్షా కార్మికులు వృద్ధులను మెడికల్ క్యాంపులకు తమ రిక్షాలో ఉచితంగా తీసుకొచ్చారు. చెన్నైలోని కూరగాయల వ్యాపారులు కూరగాయలను స్థానిక ఎన్జీఓ సంస్థలకు, దివ్యాంగులకు అందజేశారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఔదార్యంతో కూడిన దానాలు ఇలా చాలా ఉన్నాయి. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. వారందరికీ మీ మద్దతు కావాలి. చాలా సంస్థలు, వెబ్‌సైట్లు ద్వారా దానం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. మీకు నచ్చిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి దానం చేయండి. లేదా మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తులుంటే వారికి మీ విరాళాలను ఇవ్వండి. అది మీ మనసుకు తోచినంతగా ఆనందంతో ఇవ్వండి.

ఈ సారి వేడుకలకు సన్నద్ధం అయిన నేపథ్యంలో మరో ముందడుగు వేయాలని భావిస్తున్నాం. క్రిస్మస్, దీపావళి, ఈద్, నవరోజ్‌ పర్వదినాల్లా దేశంలో చాలా పండుగలను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగానే అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు దానోత్సవాల పేరుతో వేడుకలను జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా ఇది జరుపుకుంటామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఔదార్యంతో కూడిన దానాలు ఎప్పటికీ వేడుకలానే ఉండేలా ప్రయత్నం చేద్దాం.

ఇట్లు
ఆలియా భట్
అమితాబ్ బచ్చన్
అను అగా
అజీమ్ ప్రేమ్‌జీ
చావి రజావత్
దేవి శెట్టి
జస్టిస్ శ్రీకృష్ణ
లతా మంగేష్కర్
మేరీ కోమ్
సచిన్ టెండూల్కర్

English summary
DaanUtsav is India's own festival that celebrates giving. It takes place every year from the 2nd to 8th October, providing you with the opportunity to contribute time, money, materials or skills to benefit an individual, organization or cause that means something to you.Daan, in Pali or Sanskrit, connotes the virtue of generosity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X