వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్నా .. బయటకు వెళ్తే కరోనా వస్తుంది.. వెళ్లొద్దు .. పోలీసుల కుటుంబాల్లో చిన్నారుల రోదన

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ రోజు రోజుకు దేశంలో పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయినా ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న నేపధ్యంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాలు సూచించాయి. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న వారిపై లాఠీ ఝుళిపిస్తున్నారు. ఎవరూ బయట తిరగకుండా 24 గంటలు పహారా కాస్తున్నారు. అయితే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చాలా మంది విమర్శిస్తున్నా పోలీసుల కుటుంబాల్లో తమ వారి పట్ల ఆవేదన మరోలా ఉంది.

కారు ఆపితే యువతి హంగామా ..పోలీసు చెయ్యి కొరికి రక్తం వాళ్ళ మీదే పూసి హల్చల్కారు ఆపితే యువతి హంగామా ..పోలీసు చెయ్యి కొరికి రక్తం వాళ్ళ మీదే పూసి హల్చల్

దేశమంతా లాక్ డౌన్ .. విధి నిర్వహణలో పోలీసులు

దేశమంతా లాక్ డౌన్ .. విధి నిర్వహణలో పోలీసులు

దేశం అంతా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయితే ప్రజలను రక్షించటానికి పోలీసులు రోడ్ల మీద మ్విదులు నిర్వర్తిస్తున్నారు. సామాన్య ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్న తరుణంలో అత్యవసర సర్వీసులలో ఉండే సిబ్బంది అయిన పోలీసులు, వైద్యులు అత్యంత సాహసోపేతంగా దేశం కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక వారి కుటుంబ సభ్యులు పండుగ సమయాలలోనూ పోలీసులకు కుటుంబాలతో గడపటానికి సమయం ఉండదు. ఇప్పుడు దేశం మొత్తం షట్ డౌన్ అయినా, అందరూ ఇళ్లకే పరిమితం అయినా పోలీసులు మాత్రం విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి .

పోలీసు కుటుంబాల్లో చిన్నారులకు కరోనా భయం

పోలీసు కుటుంబాల్లో చిన్నారులకు కరోనా భయం

ఇక ఈ క్రమంలో పోలీసుల కుటుంబాల్లో చాలా వరకు అసహనం వ్యక్తం అవుతుంది. అయినప్పటికే ప్రజల ధన, మాన , ప్రాణాలు కాపాడే వృత్తిలో ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితి అని మహిళలు, పెద్దలు అర్ధం చేసుకుంటారు. కానీ తెలిసీ తెలియని వయసున్న చిన్నారులు బయటకు వెళ్లొద్దు అని ఏడుస్తున్న పరిస్థితి పోలీసుల కుటుంబాల్లో పరిస్థితిని చెప్పకనే చెప్తుంది . కరోనా ఎలా ఉంటుందో తెలియకపోయినా చిన్న పిల్లలు కూడా కరోనా అంటే భయపడుతున్నారు.

తమ తండ్రులు బయటకు వెళ్లొద్దు అని ఏడుస్తున్న చిన్నారులు

తమ తండ్రులు బయటకు వెళ్లొద్దు అని ఏడుస్తున్న చిన్నారులు

పోలీసులుగా విధులు నిర్వర్తించే తమ తండ్రులకు కరోనా వస్తుందని భయపడి వారు వెళ్లొద్దు అని ఏడుస్తున్నారు. తమ తండ్రులు బయటకు వెళ్తున్నారని తెలిసి చిన్నారులు నాన్నా వెళ్లొద్దు కరోనా వస్తుంది అని ఏడవడం మొదలు పెడుతున్నారు. బయట కరోనా ఉంది వెళ్లొద్దు అని బాగా ఇబ్బంది పెడుతున్నారు. కరోనా అంటే ఏంటో అసలే తెలియని పిల్లలు కూడా కరోనా అంటే ఒక బూచిలా భావించి తమ వారికి ఏం హాని చేస్తుందో అని భయపడుతున్నారు.

Recommended Video

Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
మహారాష్ట్రలో పోలీస్ కానిస్టేబుల్ అయిన తండ్రిని బయటకు వెళ్లొద్దు అని ఏడుస్తున్న చిన్నారి వీడియో వైరల్

మహారాష్ట్రలో పోలీస్ కానిస్టేబుల్ అయిన తండ్రిని బయటకు వెళ్లొద్దు అని ఏడుస్తున్న చిన్నారి వీడియో వైరల్

కర్తవ్య నిర్వహణలో భాగంగా పోలీసులకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. దేశం ఇలాంటి విపత్కర సమయంలో ఉన్నప్పుడు పోలీసులు ఇంట్లో కూర్చోలేరు. తప్పని సరిగా తన విధి నిర్వహణ చేసి తీరాలి . ఇక మహారాష్ట్రలో ఇదే తరహాలో తండ్రి పోలీసు కానిస్టేబుల్ కాగా చిన్నారి నాన్నా బయటకు వెళ్లొద్దు అని ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పోలీసు కుటుంబాల పరిస్థితికి అద్దం పడుతుంది .

English summary
The national lockdown over the coronavirus police are doing their jobs on orads to control public on roads. However, the situation of the families of the police is not known, as the little girls who are innocent are crying out for not going out. Even children are scared of what Corona means, even if they don't know what Corona looks like. They are crying that they should not go to duties in fear of corona for their fathers who are serving as policemen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X