• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు... అసలు ఎవరీ ఫాల్కే, ఈ అవార్డు ఎందుకిస్తారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రజనీకాంత్

తమిళ సినీ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది.

51వ దాదా సాహెబ్ పాల్కే అవార్డును ఆయనకు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

గత ఏడాది హిందీ నటుడు అమితాబ్ బచ్ఛన్‌కు ఈ అవార్డు వచ్చింది.

https://twitter.com/ANI/status/1377479896579010562

ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కేంద్రం రజనీకాంత్‌కు ఈ అవార్డు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

తమిళనాడులో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేస్తోంది.

రజనీకాంత్ కూడా సొంత పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇదివరకు అంతా భావించారు.

ఆయన కూడా ఈ ఎన్నికలతో తాను రాజకీయాల్లోకి వస్తానని మొదట చెప్పారు.

చివరికి అనారోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని, తన నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎవరీ దాదాసాహెబ్ ఫాల్కే

దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారత దేశంలో 1870 ఏప్రిల్ 30న టింబక్ అనే ఊరిలో ఫాల్కే జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది.

ఫాల్కేను భారతీయ సినిమాకు పితామహుడిగా భావిస్తారు. తొలి భారతీయ సినిమాను రూపొందించిన ఘనత ఫాల్కేదే.

సృజనాత్మక కళలంటే చిన్నతనం నుంచే ఫాల్కేకు ఆసక్తి ఎక్కువగా ఉండేది. తన కలలను నెరవేర్చుకునే లక్ష్యంతో 1885లో బొంబాయిలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో చేరారు. అక్కడ ఆయన ఫొటోగ్రఫీ, లిథోగ్రఫీ, ఆర్కిటెక్చర్‌, డ్రామాలు వేయడం వంటి ఎన్నో అంశాలను నేర్చుకున్నారు. అంతేకాదు, ఇంద్రజాల విద్యలను కూడా అభ్యసించారు.

కొద్దికాలం పాటు ఓ పెయింటర్‌గా, సినిమా సెట్లకు డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు.

ప్రఖ్యాత చిత్రకారుడు రవివర్మకు చెందిన ప్రెస్‌లో పనిచేస్తుండగా వర్మ గీసిన హిందూ దేవతల చిత్రాలను చూసిన ఫాల్కే వాటినుంచి ఎంతో స్ఫూర్తిని పొందారు.

1908లో మరొక వ్యక్తితో కలసి 'ఫాల్కేస్ ఆర్ట్ ప్రింటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ వర్క్స్' అనే పేరుతో ఓ వ్యాపారాన్ని ప్రారంభించినా, ఇద్దరి మధ్యా విభేదాల కారణంగా అది రాణించలేదు.

ఆ తర్వాత ఓసారి 1910లో మూకీ చిత్రం 'ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్'ను చూడడం ఫాల్కే జీవితాన్ని మలుపు తిప్పింది. ఎలాగైనా సినిమా నిర్మాణాన్ని భారత్‌కు తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.

దీంతో 1912లో సినిమాలకు సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు లండన్ వెళ్లారు.

ఆ తర్వాత 1913లో భారత తొలి మూకీ సినిమా 'రాజా హరిశ్చంద్ర'ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కథనం, నిర్మాణం, దర్శకత్వం, పంపిణీ బాధ్యతలన్నీ ఫాల్కేనే నిర్వహించారు.

ఇది భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది.

సినిమాల్లో మహిళలు నటించడం అనేది ఆ రోజుల్లో ఊహించలేని విషయం. కానీ ఆయన 1913లో తన తదుపరి సినిమా 'భస్మాసుర్ మోహిని'లో ఓ మహిళను ప్రధాన పాత్రలో నటింపజేశారు.

1917లో హిందుస్తాన్ ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. ఆ సంస్థ నుంచి ఎన్నో సినిమాలు నిర్మించారు.

లంకా దహన్ (1917), శ్రీ కృష్ణ జన్మ (1918), సైరంధ్రి (1920), శకుంతల (1920) వంటి ఎన్నో విజయవంతమైన పౌరాణిక చిత్రాలను నిర్మించారు.

సినిమాలకు శబ్దం తోడైన తర్వాత ఫాల్కే సేవలు మరుగునపడిపోయాయి. దీంతో ఆయన 1930లో సినిమాలు నిర్మించడాన్ని మానేశారు.

ఫాల్కే 1944 ఫిబ్రవరి 16న నాసిక్‌లో మరణించారు.

2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంటున్న కె.విశ్వనాథ్

ఈ అవార్డు ఎందుకిస్తారు

భారతీయ సినీ రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుమీద ఓ అవార్డుని ప్రకటిస్తోంది. తొలిసారిగా ఈ అవార్డును 1969లో ప్రకటించారు.

ఈ అవార్డును కూడా భారతీయ సినీ పరిశ్రమకు ఓ వ్యక్తి చేసిన సేవలకు గుర్తింపుగా అందిస్తారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రామానాయుడును అభినందిస్తున్న అమితాబ్ బచ్చన్

ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా గ్రహీతలకు అందజేస్తారు.

తెలుగు సినీరంగం నుంచి గతంలో కె.విశ్వనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు వంటి వారు ఈ అవార్డును అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dadasaheb Phalke Award for Rajinikanth, here is the history
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X