వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాచీ ధరించినందుకు దళితుడి మణికట్టు నరికేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

మదురై: తమిళనాడులోని ఓ గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గడియారం పెట్టుకున్నందుకు పాఠశాలలో బుధవారం రాత్రి ఓ దళిత బాలుడి మణికట్టును నరికేశారు. గ్రామంలోని దళితేతర సీనియర్ విద్యార్థులు ఆ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

పరంజోతి కుమారుడు రమేష్ అనే 16 ఏళ్ల బాలుడు విరుద్ధునగర్ జిల్లా తిరుతంగళ్‌లోని తిరువల్లువూరు కాలనీలో ఉంటున్నాడు. తిరుంగళ్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్న మాధ్యమిక పాఠశాలలో ప్లస్ వన్ చదువుతున్నాడు.

Dalit boy's wrists cut for wearing watch to school in Tamil Nadu

సోమవారంనాడు వాచీ ధరించిన రమేష్‌ను చూసి సీనియర్లు ఆ విషయం అడిగారు. తొలుత గడియారం తీసి విసిరేశారు. దానిపై బాలుడు గొడవకు దిగాడు. దీంతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి రమేష్ తిరతనంగళ్ రైల్వే స్టేషన్ వద్ద నడుస్తుండగా దాదాపు 15 మంది బాలురతో కూడిన ముఠా అడ్డుకుని అతని మణికట్టును నరికేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

వారి నుంచి తప్పించుకున్న బాలుడు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో అతను చేరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
A dalit boy was allegedly attacked and his wrists were cut by his non-dalit seniors in a village in Tamil Nadu on Wednesday night as he wore a watch to school on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X