అంబేద్కర్‌ను తిట్టారు: దళితులపై రాడ్లతో దాడి
పాల్గర్ (మహారాష్ట్ర): మద్యం మత్తులో ఊగిపోతూ భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ను దూషించడంమే కాకుండా అడ్డుకున్న సోదరుల మీద హత్యాయత్నం జరిగిన సంఘటన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో జరిగింది.
తీవ్రగాయాలైన సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాల్గర్ జిల్లా ఎండి నగరలో ఆర్ పీఐ కార్పొరేటర్ పాండురంగ నివాసం ఉంటున్నారు.
ఈయనకు జీత్ (30), సాగర్ (25), చేతన్ (22) అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి సాగర్ స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్బంలో మద్యం సేవించిన అతని స్నేహితులు అంబేద్కర్ ను దూషించారు.

రాజ్యంగా నిర్మాతను దూషించరాదని సాగర్ వారిని అడ్డుకున్నాడు. అంతే మద్యం మత్తులో ఉన్న వారు రాడ్లు, కర్రలు తీసుకుని సాగర్ మీద దాడి చేశారు. సోదరుడిని రక్షించడానికి వెళ్లిన జీత్, చేతన్ లను సుమారు 40 మంది చుట్టుముట్టి చితకబాదేశారు.
వారి దాడి నుంచి తప్పించుకున్న ముగ్గురు సోదరులు విరార్ పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు పలువురి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే కోందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications