దళిత బాలికపై బిఎస్పీ నేత, అనుచరుల గ్యాంగ్ రేప్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. దళిత బాలికపై స్థానిక బిఎస్పీ నేత,త అతని అనుచరులు ఏడుగురు పదే పదే రేప్ అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాదౌన్ జిల్లాలో చోటు చేసుకుంది.
బాధితురాలు బదౌన్ జిల్లా ఉస్మాన్‌పురా గ్రామానికి చెందింది. బిఎస్పీ నేత జంషెడ్ అలీ తనను మే 6వ తేదీన బలవంతంగా కారులో ఎత్తుకెళ్లాడని బాలిక తన ఫిర్యాదులో చెప్పింది. ఏదో విధంగా ఆ ముఠా నుంచి తప్పించుకున్న బాలిక తన కుటుంబ సభ్యులతో విషయం చెప్పింది.

కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నిర్బంధించి తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది.
ఢిల్లీ తదితర ప్రాంతాలకు తిప్పుతూ తనపై అత్యాచారం చేశారని బాలిక చెప్పింది. కాగా, నిందితులు జంషెడ్ అలీ, జై కుమార్ ఠాకూర్, ఛోటే లాల్, అభిషేక్ జటవ్, లోకేంద్ర జటవ్, కున్వర్ భాను, మనోజ్, స్వదేశ్‌లపై పోలీసులు కేను నమోదు చేశారు.












Click it and Unblock the Notifications