బాలిక కిడ్నాప్: పీకలదాక తాగించారు, మూడు రోజులు గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు !
ఇంటిలో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు ఆమెను రహస్య ప్రాంతంలో నిర్బందించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు కామాంధుల చెర నుంచి తప్పిం
చంఢీగర్: ఇంటిలో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు ఆమెను రహస్య ప్రాంతంలో నిర్బందించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు కామాంధుల చెర నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హిస్సారే ప్రాంతంలో దళిత వర్గానికి చెందిన 16 ఏళ్ల బాలిక నివాసం ఉంటోంది. శనివారం ఉదయం బాలిక ఒక్కటే ఇంటిలో ఉంది. తరువాత ఇద్దరు కామాంధులు బాలికను కిడ్నాప్ చేశారు. ఆమెను రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి నిర్బందించారు.

తరువాత బలవంతంగా బాలికతో మద్యం తాగించారు. మత్తులో ఉన్న బాలిక మీద కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక స్పృహలోకి వస్తే మళ్లీ మద్యం తాగించడం, స్పృహ కోల్పోయిన తరువాత మళ్లీ ఆమె మీద అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టారు.
ఇద్దరు నిందితులు ఆహారం తీసుకురావడానికి గది నుంచి బయటకు వెళ్లిన సమయంలో స్పృహలోకి వచ్చిన బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకునింది. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కామాంధుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications