• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్ కుల వివక్ష-తెన్మొళి సౌందరరాజన్ కు అవమానం-నిరసనగా సీనియర్ ఉద్యోగి రాజీనామా

|
Google Oneindia TeluguNews

కుల సమానత్వంపై ఏర్పాటు చేసిన ఓ గూగుల్ టాక్ కార్యక్రమాన్ని తమ సంస్ధ అనూహ్యంగా రద్దుచేయడంతో గూగుల్ లో సీనియర్ ఉద్యోగిగా ఉన్న తనూజా గుప్తా తాజాగా సంస్ధకు రాజీనామా సమర్పించారు. గూగుల్ న్యూస్ ప్రాజెక్ట్ మేనేజర్ గా, గూగుల్ వాకౌట్ నిర్వాహకురాలిగా, గూగ్లర్స్ ఫర్ ఎండింగ్ ఫోర్సెడ్ ఆర్బిట్రేషన్ వ్యవస్ధాపకురాలు కూడా అయిన తనూజా గుప్తా రాజీనామా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది.

తనూజా గుప్తా రాజీనామాకు కారణం దళిత హక్కుల కార్యకర్త, ఈక్వాలిటీ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తేన్‌మొళి సౌందరరాజన్ పాల్గొనాల్సిన ఆ గూగుల్ టాక్ రద్దు కావడమే. ఓ దళిత హక్కుల కార్యకర్త పాల్గొంటున్నందున గూగుల్ కులవివక్షతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జూన్ 5న ది న్యూస్ మినిట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెన్మొళి.. కులం, గూగుల్ టాక్ వివాదం, కులరహిత సమాజం కోసం ఈ టెక్ దిగ్గజం తీసుకోవాల్సిన చర్యలపై స్పందించారు.

dalit rights worker Thenmozhi Soundararajan key comments on casticm amid Google Row

తెన్మొళి సౌందరరాజన్‌ను "హిందూ వ్యతిరేకి", "హిందూ-ఫోబిక్" అని పిలిచే అనేక మంది గూగుల్ ఉద్యోగులు.. తమ కంపెనీ అధిపతులకు ఇమెయిల్‌లు పంపిన తర్వాత, సౌందరరాజన్ దీనిని "కుల మత ఛాందసవాదులు", "తప్పుడు సమాచార ప్రచారంగా అభివర్ణించారు. అనంతరం ఆమె.. ఉన్నత కుల భారతీయ కుటుంబానికి చెందిన గూగుల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్‌కి తన ప్రదర్శనను ఇవ్వడానికి అనుమతించమని విజ్ఞప్తి చేశారు. అయితే ఆమెకు ఎలాంటి స్పందన రాలేదు.

దీనిపై ది న్యూస్ మినిట్ వర్చువల్ చర్చలో ఎడిటర్ ధన్య రాజేంద్రన్‌తో మాట్లాడుతూ.. "చర్చకు రెండు రోజుల ముందు, ఒక చిన్న సమూహం కుల మతపరమైన, తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుందని తెన్మొళి సౌందరరాజన్ తెలిపారు. అలాగే ఆ వ్యాఖ్యలు చాలా హింసాత్మకంగా, అవమానకరంగా ఉన్నాయన్నారు. దళితుల పరంగా కూడా చట్టవిరుద్ధం ఎందుకంటే తాము దక్షిణాసియాలోనే కాకుండా అమెరికాలో అనేక పౌర హక్కుల సంస్థలలో పోరాడుతున్నట్లు తెలిపారు.

తనూజా గుప్తా రాజీనామా తర్వాత... ఇది కుల వివక్షకు వ్యతిరేకమని స్పష్టం చేయడానికి గూగుల్ ప్రయత్నించిందని, తమ కార్యాలయంలో ప్రతీకారం, వివక్షకు వ్యతిరేకంగా చాలా స్పష్టమైన, అందరికీ ఆమోదయోగ్యమైన విధానం ఉందని గూగుల్ పేర్కొంది.

గూగుల్ కుల సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందని ఈ ఇంటర్వ్యూలో తెన్మొళి సౌందరరాజన్ తెలిపారు. గూగుల్‌లో చాలా ఉన్నత నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు కులం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరని, ఈ సమస్య గురించి ఎలా మాట్లాడాలనే దానిపై నిర్ణయాలు తీసుకోవడంపై ఆలోచించాల్సిన అవసరం ఉందని, అంతే కానీ ఇలా కులవివక్షతో కూడిన నిర్ణయాలు తీసుకోరాదని ఆమె తెలిపారు.

English summary
dalit rights activist thenmozhi soundararajan has made key comments on castism in google.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X