రేప్ చేసి, కడుపులో తన్ని దళిత యువతి హత్య

త్రివేండ్రం: కేరళలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యాయ విద్య అభ్యసిస్తున్న దళిత విద్యార్థినిపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమెపై అత్యాచారం చేసిన తర్వాత కూడా దుండగులు అత్యంత అమానవీయంగా వ్యవహరించారు.

కడుపుపై తని్న, కత్తితో పొడిచి ఆమెను చంపేశారు. ఈ దారుణ సంఘటన గత నెల 28వ తేదీన జరిగింది. అయితే, ఆలస్యంగా వెలుుగు చూసింది. ఎర్నాకులం జిల్లా పెరుంబపూర్ లో బాధితురాలు మానసిక స్థిమితం లేని తల్లితో కలసి నివసించేది. ఈ నెల 28వ తేదీన ఆమె శవం బయట పడింది. ఆమె శరీరంపై పలు చోట్ల కత్తి గాట్లు ఉన్నాయి.

Dalit student brutally raped and murdered in Kerala

కడుపులో తన్నడంతో పేగులు బయటకు వచ్చాయి. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు పోస్టు మార్టం నివేదికలో తేలింది. పట్టపగలే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎవర్నీ అరెస్టు చేయలేదు. రెండు రోజుల తర్వాత అత్యాచారం ఘటనపై పత్రికల్లో వార్త వచ్చింది.

దాంతో విషయం ఆమె స్నేహితులకు తెలిసింది. బాధితురాలి ఇంట్లోనే ఈ దారుణం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. దుండగులు చాలా సమయం ఇంట్లోనే ఉండి ఉంటారని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+