దళిత కార్డు: కర్ణాటక సీఎం సిద్దు సీటుకు ఎసరు?

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ప్రతిపక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. దళితుడిని కర్ణాటక ముఖ్యమంత్రి చెయ్యాలని ఒక వర్గం వారు డిమాండ్ చేస్తున్నారు. జేడీఎస్ నుండి వలస వచ్చిన సిద్దరామయ్య సీఎం కుర్చిని తన్నుకుని వెళ్లాడని ఇంత కాలం కస్సుబస్సు మని ఉన్న ఒక వర్గం నాయకులు ఇప్పడు ఏకంగా బహిరంగంగానే ఆయన మీద విరుచుకుపడుతున్నారు.

దళితుడు, విధ్యావంతుడు, కేపీసీసీ అధ్యక్షుడు అయిన డాక్టర్ జీ. పరమేశ్వర్ ను సీఎం చెయ్యాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం రమేశ్వర్ తన వర్గీయులతో కలిసి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో కర్ణాటక రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారని కేపీసీసీ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే అధిష్టానం పరమేశ్వర్కు అపాయింట్ ఇచ్చింది. దళితుడిని ముఖ్యమంత్రిని చెయ్యాలని ఒవ వర్గం వారు చాల కాలం నుండి డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు ఎర్పాటు చేసి అధిష్టానం మీద ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈ సందర్బంలో సీఎం సిద్దరామయ్య స్పందిస్తు సభలు, సమావేశాలు నిర్వహించి దలితుడిని సీఎం చెయ్యాలని డిమాండ్ చేస్తున్న వారికి కాంగ్రెస్ పార్టికి అసలు సంబంధం లేదని చెప్పారు. సోమవారం బెంగళూరు నగరంలో దలిత సంఘాల నాయకులు సమావేశం జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారి కే. శివరాం, శంకరప్ప, వెంకటస్వామి తదితరులు ఈ సమావేశానికి నాయకత్వం వహించారు.

 Dalith card: CM Sidharamaih faces trouble

ఈ సందర్బంలో దళితుడిని సీఎం చేసే వరకు పోరాటం చెయ్యాలని వీరు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న విదంగానే మంగళవారం బళ్లారిలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతు ర్యాలి నిర్వహించారు. తరువాత అధిష్టానికి ఫ్యాక్స్ లు పంపించారు. పరమేశ్వర్ సీఎం కావాలని అధిష్టానాన్ని పరోక్షంగా హెచ్చరించారు. ఇదే సమయంలో పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెల్లడం కాంగ్రెస్ వర్గాలలో చర్చకు దారి తీసింది. 9 సంవత్సరాల తరువాత కర్ణాటకలో పార్టీ అధికారంలోకి రావడానికి తాను శక్తి వంచన లేకుండ పని చేశానని ఒక్క సారి అవకాశం కల్పించాలని పరమేశ్వర్ అధిష్టానం ముందు మనవి చేస్తారని తెలిసింది.

ఇటివల బెంగళూరు వచ్చిన ఏఐసీసీ సీనియర్ నాయకుడు, రాష్ర్ట ఇన్ చార్జ్ దిగ్వియ్ సింగ్ కాంగ్రెస్ శాసన సభ్యులతో సమావేశం ఎర్పాటు చేసి విడివిడిగా మాట్లాడారు. తరువాత మీడియాతో మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ సిద్దరామయ్య చాల బాగ పని చేస్తున్నారని, ఆయనను ఎందుకు మార్చాలి అని అన్నారు. సిద్దును ఎలాంటి పరిస్థిలో మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపద్యంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తల దగ్గర ఒక్కోక్కరి నుండి రూ. 250 చోప్పన సభ్యత్వ రుసుం వసూలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

కూల్ గా పని చేసుకుని వెళుతున్న సిద్దు........!

తన సీఎం కుర్చికి ఎసరు పెడుతున్నారని తెలిసినా సిద్దరామయ్య కూల్ గా పని చేసుకుని వెళుతున్నారు. మంగళవారం వివిద శాఖల అధికారులు, మంత్రులుతో చర్చించి తీరక లేకుండా గడిపారు. 2015/16 బడ్జెట్ ఎలా తయారు చెయ్యాలని అధికారులు, మంత్రులతో చర్చించారు. ఎలాగైనా సిద్దరామయ్యను కుర్చిలో నుండి కిందకు దించాలని జేడీఎస్ నాయకులు బావిస్తున్నారు. ఇప్పటికే సిద్దరామయ్య అవకతవకలకు పాల్పడ్డాడని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+