బీజేపీకి దళితులు దూరమవుతున్నారా..? 2019 ఎన్నికల్లో భారత్ ఓటు ఎవరి పక్షం..?
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ఓ సభలో ప్రసంగిస్తూ విపక్షాలపై నిప్పులు చెరిగారు. భారత దేశానికి ఒక వెనకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి ప్రధాని అయినందుకు జీర్ణించుకోలేకున్నాయన్నారు. ఒక దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే సత్తా తమకు సొంతంగా వచ్చిందనే ఊహను వారు జీర్ణించుకోలేకున్నారని ధ్వజమెత్తారు. అందులో దళితుడిని రాష్ట్రపతిని చేయడం విపక్షాలకు అస్సలు నిద్రపట్టనివ్వడం లేదని ఫైర్ అయ్యారు. అంతేకాదు బీజేపీలోనే దేశ పార్లమెంటులో కానీ ఆయా రాష్ట్ర అసెంబ్లీలోకానీ దళితులు గిరిజనులు, బీసీలు ప్రజాప్రతినిధులుగా ఉన్నారని గుర్తు చేశారు.
మోడీ ప్రసంగంలో చెప్పిన మాటలు కరెక్టు అని చెప్పలేము అలా అని తప్పు అని చెప్పలేము. 2014 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీలో సభ్యులుగా ఎక్కువగా దళితులు, గిరిజనులు ఇతర బీసీలు ఉన్నారు.అయితే దళితులకు, గిరిజనులకు బీజేపీ ఏమీ చేయలేదన్నది వాస్తవం. పార్లమెంటుకు ఎన్నికైన వారిలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిన స్థానాలనుంచే గెలుపొందారు. మరోవైపు ఓబీసీ ప్రతినిధుల రేట్ పార్లమెంటులో బీజేపీ నుంచి పడిపోయింది. ముస్లింలకు ఆశాదీపం బీజేపీ ఒక్కటేనని చెబుతూ... కాంగ్రెస్‌కున్న ముస్లిం ఓటు బ్యాంకును తమవైపు తిప్పే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.

కనిపించని ముస్లిం ఓట్లు ఏమయ్యాయి?
అందరి ఓట్లు కలిస్తేనే అభ్యర్థి గెలుపు సాధ్యమవుతుంది. కానీ బీజేపీ మాత్రం 2014 లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు తమకే ఓటేశారని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ వాస్తవానికి బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు లేదు. ఢిల్లీలోని చాందిని చౌక్, బీహార్‌లో సుపౌల్‌లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నందున తప్పని పరిస్థితుల్లో ఒక అభ్యర్థికి ఓటు వేయాల్సిందే. అందుకే ఆ చోట్ల బీజేపీ నెగ్గుకొచ్చింది. అయితే డేటా నెట్ ఇండియా అనే సంస్థ 2001 గణాంకాల ప్రకారం దేశంలో ముస్లిం మెజర్టీ ఉన్న నియోజకవర్గాలు 15 మాత్రమేనని గుర్తించింది. కానీ ఇక్కడెక్కడా బీజేపీ 2014లో గెలవలేదు.
ఒక సీటు కేవలం ముస్లిం సామాజిక ఓట్లతోనే గెలిచాడంటే అది అసాధ్యం. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు గమనిస్తే.. అటు పూర్తి మెజార్టీ కాకుండా ఇటు స్వల్ప మెజార్టీ కాకుండా మధ్యలో విజయం సాధించిన అభ్యర్థికి 47శాతం ఓట్లు వచ్చాయి. లడఖ్ లాంటి ప్రాంతాల్లో స్వల్ప మెజార్టీ 26శాతంతో అభ్యర్థి గెలిచాడు. 2014 సాధారణ ఎన్నికల్లో 11 నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థుల ఓటు షేర్ ముస్లిమేతర ఓట్లుగా ఉన్నాయి. అయితే ముస్లిం ఓట్లు కచ్చితంగా అభ్యర్థికి పడ్డాయని అర్థం. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఒక్కరు కూడా గెలవలేదు.

బీజేపీకి తగ్గుతున్న దళిత , ఆదివాసీల మద్దతు
2014లో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు బీజేపీకే మద్దతు ఇచ్చారు. కానీ ఈ సారి పరిస్థితి అలా కనిపించడంలేదు. 1990 దశకాల్లో 10 మంది దళితుల్లో ఒకరు బీజేపీకి మద్దతు పలికేవారని అదే 2014 ఎన్నికల్లో నలుగరు దళితుల్లో ఒకరు బీజేపీకి ఓటువేశారని రాజకీయ శాస్త్రవేత్త రాహుల్ వర్మా తెలిపారు. అంతేకాదు దళితుల ఓట్లను కూడగట్టడంలో కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలకంటే బీజేపీ ఈ సారి సఫలమైందని చెప్పాలి. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం పట్టణాలు నగరాల్లో నివసిస్తున్న విద్యావంతులైన దళిత ఓట్లనే నమ్ముకుంది. 2014 తర్వాత బీజేపీకి దళితుల మద్దతు క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం కొంత బెడిసి కొట్టింది.

యూపీలో దళితులపై దాడే బీజేపీకి శాపమా..?
దళితుల మద్దతు బీజేపీ కోల్పోవడానికి కారణం ఉత్తర్ ప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దాడులే కారణం. అంతేకాదు సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇచ్చిన తీర్పుతో కూడా దళితుల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచింది. ప్రస్తుతం 2014లో బీజేపీకి దక్కిన దళితుల మద్దతు ఇప్పుడు కనిపించడం లేదని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీకి ఆదివాసీల మద్దతు కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. మరోవైపు ఓబీసీ మద్దతు బీజేపీకి పెరుగుతోందని లోక్‌నీతి సర్వే వెల్లడించింది.

పొత్తు పెట్టుకున్న పార్టీలలో అసంతృప్తి..?
2014లో బీజేపీకి దళితులతో పాటు , అగ్రకులాల ఓట్లు కూడా దక్కాయి. మిగతా పార్టీలకు ముస్లింల నుంచి ఉన్న మద్దతు బీజేపీకి లేదు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలకు 56శాతం ఓట్లు అగ్రకులాల నుంచి వచ్చినట్లే లోక్‌నీతి సర్వే స్పష్టం చేస్తోంది. ఇక ముస్లిం ఓట్లు అంటే కాంగ్రెస్‌కే అన్న భావన ఇప్పటి వరకు హస్తం పార్టీ పూర్తిస్థాయిలో నిరూపించుకోలేకపోయింది. అగ్రకులాల ఓట్లు బీజేపీకి గ్యారెంటీగా పడతాయని కమలం పార్టీ నిరూపించుకుంది. అలా ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయని గ్యారెంటీగా చెప్పలేకుంది. 1990 నుంచి 2000 మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ముస్లిం ఓటు బ్యాంకు 40 శాతం దాటిన దాఖలాలు లేవు. కానీ బీజేపీకి ఈ సారి తమ మిత్రపక్షాల నుంచే కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఓట్లు ఎలా వెళతాయనేది వేచి చూడాలి. అన్ని వర్గాల ప్రజలు బీజేపీతోనే ఉన్నారని అది కేవలం కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న విషం అని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!