వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ప్రమాదకర దశలో ఉన్నాం,100 దేశాల్లో డెల్టా వేరియంట్ .. తక్షణ కర్తవ్యం ఇదే : డబ్ల్యూహెచ్ఓ

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి యొక్క చాలా ప్రమాదకరమైన దశలో ప్రపంచం ఉందని డబ్ల్యూహెచ్వో చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ దాదాపు 100 దేశాలలో వ్యాప్తి చెందుతుందని పేర్కొన్న ఆయన, భారతదేశంలో పుట్టిన డెల్టా వేరియంట్ కరోనా మహమ్మారి యొక్క అత్యంత ఆధిపత్య వేరియంట్ గా మారిందని వెల్లడించారు. మిగతా వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరంగా ఈ వేరియంట్ అభివృద్ధి చెందుతుందని డబ్ల్యూహెచ్వో చీఫ్ స్పష్టం చేశారు.

డెల్టా ప్లస్ మాత్రమే కాదు, ప్రమాదకరమైన మరో మూడు వేరియంట్లు.. కింకర్తవ్యం ఇదే !!డెల్టా ప్లస్ మాత్రమే కాదు, ప్రమాదకరమైన మరో మూడు వేరియంట్లు.. కింకర్తవ్యం ఇదే !!

వ్యాక్సినేషన్ మాత్రమే కరోనా తీవ్రతను తగ్గిస్తుంది

వ్యాక్సినేషన్ మాత్రమే కరోనా తీవ్రతను తగ్గిస్తుంది

వచ్చే ఏడాది ఈ సమయానికి ప్రతి దేశంలో 70 శాతం మందికి టీకాల వేసేలా చూడాలని, వ్యాక్సినేషన్ ఒక్కటే కరోనా మహమ్మారి యొక్క తీవ్రమైన దశను సమర్థవంతంగా అంతం చేస్తుందని ఆయన సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులను తాను ఇప్పటికే కోరానని వెల్లడించిన ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియలో అసమానతపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది అని, ప్రస్తుతం అది కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు.

 పేద దేశాల్లో వ్యాక్సినేషన్ లో వెనకబాటుతనం

పేద దేశాల్లో వ్యాక్సినేషన్ లో వెనకబాటుతనం

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మూడు బిలియన్ల మోతాదుల వ్యాక్సిన్ పంపిణీ చేయబడింది అని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అన్ని దేశాలు వ్యాక్సిన్లను పంచుకోవడానికి సమిష్టి కృషి చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇప్పటికీ చాలా పేద దేశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా వెనుకబాటుతనానికి గురైందని ఆయన వెల్లడించారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోందని మొత్తం కోవిడ్ కోసం వ్యాక్సినేషన్ చేసిన దేశాలలో పేద దేశాలు రెండు శాతం కన్నా తక్కువగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

 కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రపంచానికి ముప్పే

కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రపంచానికి ముప్పే

యుఎస్ఎ, బ్రిటన్, ఫ్రాన్స్ మరియు కెనడా వంటి ధనిక దేశాలు 1 బిలియన్ వ్యాక్సిన్లను విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేశాయని గుర్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మొత్తం ప్రపంచానికి టీకాలు వేయడానికి 11 బిలియన్ మోతాదులకు పైగా అంచనా వేసింది. కొన్ని దేశాలలో వ్యాక్సినేషన్ యుద్ధప్రాతిపదికన సాగి, మరికొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ విఫలమైతే అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని వెల్లడించారు .

వచ్చే ఏడాది జులైలోగా కనీసం 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తేనే ముప్పు నుండి ఉపశమనం

వచ్చే ఏడాది జులైలోగా కనీసం 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తేనే ముప్పు నుండి ఉపశమనం

ప్రతి దేశ జనాభాలో కనీసం 10 శాతం మందికి సెప్టెంబరు నాటికి టీకాలు వేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం జరగాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు. కనీసం 40 శాతం ఈ సంవత్సరాంతానికి, వచ్చే ఏడాది మధ్యలో కనీసం 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేస్తే ముప్పు నుంచి కాపాడుకోవచ్చు అన్నారు. వ్యాక్సిన్ ఈక్విటీ చేయడం సరైన పని మాత్రమే కాదు, మహమ్మారిని నియంత్రించడానికి మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రీబూట్ చేయడానికి ఇది ఉత్తమమైన మార్గం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ హెచ్చరించారు .

English summary
The Director-General of the WHO said world is in “a very dangerous period” of the Covid-19 pandemic after the contagious Delta variant was found in nearly 100 countries. Suggesting that vaccination would effectively end the acute phase of the pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X