• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముసలాయన ఆశ పడ్డారు..! డేటింగ్ వెబ్‌సైటోళ్లు 46 లక్షలు గుంజారు

|

ఢిల్లీ : బంధాలు బలహీనపడుతున్నాయి. కొత్త అనుబంధాల వెంపర్లాటలో తప్పులు జరుగుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న తరుణంలో బంధాల అర్థాలు మారిపోతున్నాయి. కనీసం మాట్లాడేవారు కరువై వృద్ధులు దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా మోసగిస్తున్నారు. ఆ క్రమంలో 65 ఏళ్ల వృద్ధుడు.. కాని దానికోసం ఆశపడి 46 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. రిటైరైతే వచ్చిన సొమ్మును డేటింగ్ వెబ్‌సైట్‌కు అప్పనంగా అప్పగించేశాడు.

ట్యాంపరింగ్ కుదరదంట..! నిజామాబాద్ బరిలో M-3 ఈవీఎంలు

 డేటింగ్ ఆశ.. కొంపముంచిందిగా..!

డేటింగ్ ఆశ.. కొంపముంచిందిగా..!

ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైరైన ఆ వృద్ధుడు.. 2018, మే నెలలో డేటింగుకు సంబంధించిన ఒక వెబ్‌సైట్‌లో తన వివరాలు నమోదు చేసి రిజిస్టర్‌ చేసుకున్నాడు. అనంతరం సదరు వెబ్‌సైట్‌ కార్యాలయం నుంచి ఫోన్ చేసిన మహిళ.. ప్రీమియం మెంబర్ షిప్ లాభాల గురించి వివరించింది. అందులో రిజిస్టరైతే ఎన్నో లాభాలుంటాయని నమ్మించింది. దానికోసం కొంత మొత్తం చెల్లించాలని కోరగా ఆయన పేమెంట్ చేశాడు.

ఇక ఆ తంతు ముగిశాక ముగ్గురు మహిళలకు సంబంధించిన ఫోటోలు ఆ వృద్ధుడికి పంపించారు వెబ్‌సైట్‌ నిర్వాహకులు. అందులోనుంచి ఒక లేడీని సెలెక్ట్ చేసుకున్నారు పెద్దాయన. అయితే ఆమెతో డేటింగ్ చేయాలంటే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలనే కండిషన్ పెట్టారు. అది చెల్లించాక.. బీమా, వెరిఫికేషన్ అంటూ పలుమార్లు లక్షలకొద్దీ గుంజారు.

 డేటింగ్ ఏమో గానీ.. రిటైరైన సొమ్ము..!

డేటింగ్ ఏమో గానీ.. రిటైరైన సొమ్ము..!

అందినకాడికి దోచుకున్నట్లు 30 లక్షల రూపాయలు ముట్టాక.. ఓ మహిళ నెంబరును ఆయనకిచ్చారు. అప్పటినుంచి ఆమెతో ఫోన్లో తరచుగా మాట్లాడారు పెద్దాయన. ఆ కిలేడీ సైతం ఆయన నుంచి భారీగానే వసూలు చేసిందట. డేటింగ్ ఏమో గానీ.. కుంటిసాకులు చెబుతూ బురిడీ కొట్టించింది. రోజులు గడుస్తున్నా.. డేటింగ్ కి మాత్రం రాకపోవడం ఆయనకు అనుమానం తెప్పించింది. లక్షల రూపాయలు పోగొట్టుకున్నాక గానీ అసలు విషయం బోధపడలేదు.

జరిగిన మోసంపై వెబ్‌సైట్‌ నిర్వాహకులకు ఫోన్ చేసి నిలదీశారు. తన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని, తాను చెల్లించిన 46 లక్షల 25 వేల రూపాయలను తిరిగి చెల్లించాలంటూ కోరారు. దానికి సరేనన్న నిర్వాహకులు జనవరి చివరినాటికి మొత్తం డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

 మోసం చేశారు.. పోలీసులకు ఫిర్యాదు

మోసం చేశారు.. పోలీసులకు ఫిర్యాదు

వెబ్‌సైట్‌ నిర్వాహకులు చెప్పిన గడువు ముగిశాక మళ్లీ ఫోన్ చేస్తే ఆయన కాల్స్ కు స్పందించలేదు. అసలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేశారు. అలా రెండు నెలలు ఓపిక పట్టిన ఆ వృద్ధుడు.. చివరకు తాను పూర్తిగా మోసపోయినట్లు గుర్తించారు. ఇలా జరిగిందంటే కుటుంబ సభ్యుల దగ్గర పరువు పోతుందని భయపడ్డారు పెద్దాయన. జనవరి నుంచి ఇప్పటిదాకా తనలో తాను కుమిలిపోయి చివరకు ఫ్యామిలీ మెంబర్స్ కు విషయం వివరించారు. 65 ఏళ్లు కష్టపడి రిటైరయ్యాక వచ్చిన సొమ్ము అలా డేటింగ్ వెబ్‌సైట్‌ పాలుకావడంతో వారు జీర్ణించుకోలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dating Website Cheated an Old Man and Collected 46 Lakh Rupees. He was an private employee and he got some lakhs of rupees as retirement benefits. He registered in dating website then after they people called and collected 46 lakh rupees as part. At last he concluded that they were cheated and given a police complaint with the help of family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more