స్వామీజీ నిర్వాకం: పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడు
బెంగళూరు: మహిళపై అత్యాచారం చేసి, హత్య చేస్తానని బెదిరించాడనే ఆరోపణలపై ఓ స్వామీజిని కర్ణాటకలోని దావణగెరె పోలీసులు అరెస్టు చేశారు. చిత్రదుర్గ బంజార గురుపీఠాధిపతి సర్దార్ సేవాలాల్ స్వామీజిని బుధవారం అరెస్టు చేశారు. సేవాలాల్ స్వామీజిని 24 గంటలలో అరెస్టు చెయ్యాలని మంగళవారం దావణగెరె కోర్టు స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
సర్దార్ సేవాలాల్ స్వామీజి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి లోంగదీసుకుని అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకోవాలని అడిగితే చంపేస్తానని బెదిరించారని దావణగెరెకి చెందిన ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన టీచర్

దావణగెరె జిల్లా బెళవనూరు సమీపంలోని స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న మహిళ 2006లో సేవాలాల్ స్వామీజి పరిచయం అయ్యారు. తరువాత తనను వివాహం చేసుకుంటానని అప్పటి నుండి తన మీద స్వామీజి అత్యాచారం చేస్తున్నాడని ఆమె ఆరోపిస్తున్నారు.
వివాహం చేసుకోవాలని వెళ్లి అడిగితే చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తు 2013 జనవరిలో బాధితురాలు దావణగెరె మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సర్దార్ సేవాలాల్ స్వామీజి మీద కేసు నమోదు చేశారు. అప్పటి నుండి దావణగెరె జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరుగుతున్నది.
విచారణకు సక్రమంగా స్వామీజి హాజరుకాలేదు. న్యాయస్థానం నోటీసులు జారి చేసినా పట్టించుకొలేదు. చివరికి న్యాయస్థానం స్వామీజిని అరెస్టు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు సేవాలాల్ స్వామీజిని అరెస్టు చేసి దావణగెరెకి తీసుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications