దావూద్ ఆస్తుల వేలం: 3 గెస్ట్‌హౌజ్‌లకు రూ.11.5 కోట్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను అధికారులు వేలం వేశారు. ముంబైలో మూడు ఆస్తులను విజయవంతంగా అమ్మేశారు.ముంబైలోని మూడు గెస్ట్‌హౌజ్‌లను విక్రయించారు.దీనికి రూ.11.5 కోట్లకు విక్రయాలు జరిగాయి.

 Dawood Ibrahim’s 3 Mumbai Properties Auctioned Off For Rs 11.5 Cr

రెండేళ్లలో దావూద్ ఆస్తులను ఆర్థిక శాఖ అధికారులు వేలం వేయడం ఇది రెండోసారి. హోటల్ రణవ్ కఫూజ్, సబ్నామ్ గెస్ట్ హైస్, దమర్‌బాల భవనంలోని ఆరు గదులను విక్రయించారు.

అండర్‌ వరల్డ్‌ డాన్‌, ముంబయి జంట పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను మంగళవారం వేలం వేశారు. దక్షిణ ముంబయిలో దావూద్‌కు చెందిన మూడు ఆస్తులకు వేలం ప్రక్రియ నిర్వహించారు. స్మగ్లర్స్‌ అండ్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మానిప్యులేటర్స్‌ యాక్ట్‌ కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వేలం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

దావూద్‌కు చెందిన హోటల్‌ రునాక్‌ అఫ్రోజ్‌, షబ్నం గెస్ట్‌ గౌస్‌, దమర్‌వాలా బిల్డింగ్‌లోని ఆరు గదులను వేలం వేశారు.సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ ఈ మూడింటి కొనుగోలుకు బిడ్‌ దాఖలు చేసినట్లు వేలం ప్రక్రియకు నేతృత్వం వహించిన అధికారి ఒకరు తెలిపారు. రునాక్‌ అఫ్రోజ్‌ హోటల్‌ రూ.4.53కోట్లు, షబ్నం గెస్ట్‌ హౌస్‌ రూ.3.52కోట్లు, దమర్‌వాలా బిల్డింగ్‌ గదులు రూ.3.53కోట్లు పలికాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three properties belonging to gangster Dawood Ibrahim have been auctioned for approximately Rs 11.5 crore. The Saifee Burhani Upliftment Trust (SBUT) has emerged the highest bidder for three of the wanted gangster’s properties in South Mumbai, that were put up for auction by the Ministry of Finance on 14 November.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి