సంచలనం: ముంబయిలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు అరెస్ట్
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను సోమవారం రాత్రి ఠానే పోలీసులు అరెస్టు చేశారు. థానేకు చెందిన ఒక వ్యాపారిని బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ఇక్బాల్ ప్రయత్నించినట్లు సమాచారం.
Recommended Video

Dawood Ibrahim's younger brother Iqbal Kaskar detained by police | Oneindia Telugu
ముంబై: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను సోమవారం రాత్రి థానే పోలీసులు అరెస్టు చేశారు. థానేకు చెందిన ఒక వ్యాపారిని బెదిరించి డబ్బు వసూలు చేయడానికి ఇక్బాల్ ప్రయత్నించినట్లు సమాచారం.
ఇలాంటివాటికి వ్యతిరేకంగా ఏర్పాటైన పోలీసు విభాగానికి సదరు వ్యాపారి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ముంబయిలోని నాగ్‌పడ ప్రాంతంలోని నివాసం నుంచి ఇక్బాల్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి వరకు పోలీసులు అతడిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. 2003లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దేశ బహిష్కారానికి గురైన ఇక్బాల్... తన సోదరుడు దావూద్‌కు ముంబయిలో ఉన్న స్థిరాస్తి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications