ఉన్నారు, నిద్రపోతున్నారు: దావూద్ భార్య ధ్రువీకరణ

న్యూఢిల్లీ: ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నారని ఆయన భార్య మీడియాకు తెలిపింది. దావూద్ పాక్‌లోనే ఉన్నట్లు భారత్ పక్క ఆధారాలు సేకరించిన విషయం విదితమే. దావూద్ కరాచీలో నివాసమున్నట్లు టెలిఫోన్ బిల్లులు లభ్యమయ్యాయి. కరాచీ అడ్రస్‌తో ఉన్న దావూద్ పాస్‌పోర్టు జిరాక్స్‌ను భారత్ సంపాదించింది.

ఈ ఆధారాలకు తోడు దావూద్ భార్య నోరు విప్పి, మా ఆయన కరాచీలోనే ఉన్నాడని స్పష్టం చేసింది. ఓ జాతీయ చానెల్ దావూద్ ఇంటి ఫోన్ నెంబర్ సంపాదించి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. శనివారం మధ్యాహ్నం ఆ చానెల్ రిపోర్టర్ దావూద్ ఇంటికి ఫోన్ చేశారు. ఆయన భార్య మెహజబీన్ షేక్ ఫోన్ ఎత్తారు.

దావూద్‌తో మాట్లాడాలని రిపోర్టర్ అడగ్గా ఆయన నిద్రపోతున్నారని మెహజబీన్ షేక్ సమాధానమిచ్చారు. మీరు కరాచీలో ఉంటున్నారు కదా అని రిపోర్టర్ ఆరా తీయగా అవునని ఆమె సమాధానం ఇచ్చారు. మరిన్ని వివరాలు అడిగేందుకు రిపోర్టర్ ప్రయత్నించారు. అయితే, ఆమె ఫోన్ కట్ చేసింది.

Dawood Ibrahim wife confirms his whereabouts

రిపోర్టర్, దావూద్ భార్య మధ్య జరిగిన సంభాషణ ఇలా...
రిపోర్టర్: హలో సలేమలేకుమ్.. మేడం మీరు మెహజబీన్ షేక్.. అవునా..
దావూద్ భార్య: అవును... ఏం కావాలి..
రిపోర్టర్: మేడం మీరు కరాచీ నుంచే మాట్లాడుతున్నారా...
దావూద్ భార్య: అవును.. మీరు ఎవరు...
రిపోర్టర్: మీరు దావూద్ ఇబ్రహీం భార్య... అవునా, కాదా..
దావూద్ భార్య: అవును.. ఆయన నిద్రపోతున్నారు.
రిపోర్టర్: నేను దావూద్ ఇబ్రహీంతో మాట్లాడలని అనుకుంటున్నాను. ఆయన ఉన్నారా...
దావూద్ భార్య: మీరు ఎవరు.... (ఫోన్ కట్ అయింది)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+