నిన్న జయప్రద, నేడు మీడియా ప్రతినిధి : మరోసారి నోరుపారేసుకున్న అజంఖాన్
న్యూఢిల్లీ : జయప్రదపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన ఎస్పీ నేత, రాంపూర్ సిట్టింగ్ అభ్యర్థి అజంఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ సారి మీడియా ప్రతినిధిపై తన మాటల ప్రతాపాన్ని చూపించారు అజంఖాన్. మధ్యప్రదేశ్‌లోని విదిషాలో ఎంపీ మునేశ్వర్ సలీమ్ అంత్యక్రియలకు హాజరైన అజంఖాన్ .. తన నోటిదురుసును ప్రదర్శించారు.

'ఖాకీ‘ గురించి ప్రశ్నిస్తే
తన ప్రత్యర్థి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రదపై ఖాకీ అండర్ వేర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీనిని మీడియా ప్రతినిధులు ప్రస్తావించడంతో కాసింత అసహనానికి గురైన అజంఖాన్, 'నేను మీ తండ్రి అంత్యక్రియలకు కూడా వస్తానని‘ తన తలపొగరు మరోసారి బయటపెట్టుకున్నాడు.

మీడియా ప్రతినిధిపై వ్యాఖ్యలు సరికాదు
ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియాపై కూడా అజంఖాన్ తలబిరుసు వ్యాఖ్యలను మేధావులు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుపై విరుచుకుపడటం సరికాదని మండిపడ్డారు. ఇది తగదని, చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు. ఇటు రాజకీయ పార్టీలు కూడా అజంఖాన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.

ఎన్‌హెచ్చార్సీ సీరియస్
జయప్రదపై కామెంట్లను జాతీయ మహిళ కమిసన్ సీరియస్ గా తీసుకుంది. కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ ఆరోరాకు ఆదేశాలు జారీచేశారు కమిసన్ చైర్ పర్సన్ రేఖా శర్మ. ఇటు అజంఖాన్ పై కేసు కూడా నమోదైంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications