Operation sindoor: రాాజస్తాన్, గుజరాత్ సరిహద్దులు మూసేసిన కేంద్రం-కనిపిస్తే కాల్చివేతే..!
పహల్గాం దాడికి ప్రతీకారంగా నిన్న పాకిస్తాన్ లోని ఉగ్రశిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారీ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించిన భారత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ ఇరుదేశాల్లోనూ అప్రమత్తత పెరిగింది. దీంతో ఇరు దేశాల్లోనూ ప్రభుత్వాలు సరిహద్దుల మూసివేతతో పాటు పలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే క్రమంలో భారత్ కూడా పాకిస్తాన్ తో తమ రెండు రాష్టాల సరిహద్దుల్ని పూర్తిగా మూసేసింది.
పాకిస్తాన్ తో సరిహద్దు కలిగిన రాజస్తాన్, పంజాబ్ రాష్ట్రాల బోర్డర్లను పూర్తిగా మూసేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్నీ బోర్డర్ల సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు అక్కడ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల్ని అమలు చేస్తోంది. అంతే కాదు పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు జరిగినా ప్రయోగించేందుకు వీలుగా మిసైల్స్ ను సైతం ఇక్కడ అందుబాటులో ఉంచింది.

ఈ రాష్ట్రాల పరిధిలో ఉన్న పారా మిలటరీ సిబ్బంది సెలవుల్ని రద్దు చేశారు. ఇప్పటికే రాజస్థాన్ లోని బికనీర్, కిషన్ గర్, జోథ్ పూర్ ఎయిర్ పోర్టుల్ని పూర్తిగా మూసేశారు. అలాగే ఈ ఈ రెండు రాష్ట్రాల్లో సుఖోయ్ యుద్ద విమానాలు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. సరిహద్దు గ్రామాలన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయి. అలాగే అత్యవసర ప్రతిస్పందన కోసం వీరి తరలింపు ప్రణాళికలు కూడా అమలు చేస్తున్నారు. సరిహద్దు సమీపంలోని యాంటీ-డ్రోన్ వ్యవస్థల్ని యాక్టివేట్ చేశారు.

రాజస్తాన్ లోని జైసల్మేర్, జోధ్‌పూర్‌లకు అర్ధరాత్రి నుండి ఉదయం 4 గంటల వరకు బ్లాక్‌అవుట్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో అత్యాధునిక హై-స్పీడ్ విమానాలకు సమస్యలు ఎదురవుతాయి. దీని వలన శత్రు పైలట్‌లు ఆయా నగరాలపై దాడి చేయడం కష్టమవుతుంది. అటు పంజాబ్‌లో పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేశారు. బహిరంగ సభలను సైతం పరిమితం చేశారు. సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు.












Click it and Unblock the Notifications