ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాగంగా మంగళవారం వారణాసి రోడ్డు షోలో పాల్గొన్న ఆమెకు అనూహ్యంగా జ్వరం రావడంతో ప్రచారాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి మధ్యలోనే వెనుదిరిగిన సోనియా ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

తొలుత ఢిల్లీలోని ఆర్మీ (రీసెర్చ్ అండ్ రిఫరెల్) ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించినప్పటికీ, బుధవారం మధ్యాహ్నం ఆమెను సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె డీహైడ్రేషన్, ఎలక్ట్రొలైట్‌ల అసమతౌల్యంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

69 ఏళ్ల సోనియా గాంధీ వారణాసి ర్యాలీలో పాల్గొన్న సమయంలో పడిపోవడంతో ఆమె మోచేయి కూడా విరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తీసుకొచ్చారని, పల్మనాలజిస్టు డాక్టర్ అరూప్ బసు, ఆయన బృందం ఆమెకు చికిత్స చేస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆసుపత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ మరో వారం రోజుల పాటు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

చార్టెడ్ ప్లయిట్‌లో ఆమెను వారణాసి నుంచి ఢిల్లీకి తరలించినప్పటి కంటే ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా మెరుగుపడిందని, ఆర్మీ ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆమె బాగా మత్తుగా ఉన్నారని.. అసలు మాట కూడా రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్, ప్రియాంకా గాంధీలు సోనియా వెంటే ఉంటున్నారు.

ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

ఐసీయూలో సోనియా గాంధీ: ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సోనియా గాంధీని పరామర్శించేందుకు వెళుతున్నారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా ఇప్పటికే ఆసుపత్రికి వెళ్లిన ఆమెను పలకరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress president Sonia Gandhi, who was taken ill during a road show in Varanasi on Tuesday, was shifted to the intensive care unit (ICU) of Sir Ganga Ram hospital (SGRH) from the Army (Research and Referral) Hospital on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి