ఎన్నికల వేళ బీహార్‌లో హైస్పీడ్ రైళ్లు - పూర్తయిన రైల్వే నెట్‌వర్క్‌ ఆధునికీకరణ - గంటకు 130కిమీ

రైల్వే నెట్‌వర్క్‌ను ఆధునీకరించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రూట్లలో గంటలకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడపాలని, ఆ మేరకు ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అన్ని రాష్ట్రలకంటే ముందుగా.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న బీహార్ లో ఈ పనులను రైల్వే శాఖ శరవేగంగా పూర్తిచేయడం గమనార్హం.

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్(మొఘల్‌సరై) నుంచి పాట్నా మీదుగా జమూయీ జిల్లా వరకు ఉన్న 393 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ బీహార్ కు లైఫ్ లైన్ గా కొనసాగుతున్నది. లాక్ డౌన్ కారణంగా ప్యాసింజర్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతో ఆ ఖాళీ సమయాన్ని సమర్థవంతంగా వాడుకున్న ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఈసీఆర్).. బీహార్ మెయిన్ లైన్ ను శరవేగంగా ఆధునికీకరించింది.

 Days before bihar elections, Railway upgrades tracks in the state, trains can hit 130 kmph

ఇప్పటిదాకా బీహార్ కు, బీహార్ గుండా వెళ్లిన రైళ్ల అత్యధిక వేగం గంటకు 110కిలోమీటర్ల లోపే ఉండగా.. 130 కి.మీ వేగానికి తగ్గట్లు స్లీపర్లు, రైల్స్(పట్టాలను) కొత్తవి ఏర్పాటు చేశారు. అదే సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా పూర్తిగా ఆధునీకరించారు. పనులకు సంబంధించి తమకు జులై, ఆగస్టులో అనుమతులు లభించాయని, ప్రస్తుతానికి 393 కిలోమీటర్ల మొఘల్ సరై-పాట్నా-జుమూయీ మార్గం పూర్తిగా రెడీ అయిందని ఈసీఆర్ అధికారులు చెప్పారు. కాగా..

అన్ లాక్ ప్రక్రియలో భాగంగా పరిమిత సంఖ్యలోనే.. కొద్ది రోజుల నుంచి బీహార్ లో రైళ్లు 130కి.మీ వేగంతో తిరుగుతున్నాయి. కానీ, రైల్వే టైమ్ టేబుల్ మార్చకుండానే సర్వీసుల వేగం పెంచడం విచిత్రపరిణామంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సర్వీసుల సంఖ్య తక్కువే అయినా, టైమ్ టేబుల్ ఒకలా, రైళ్ల వాస్తవ రాకపోకలు మరోలా ఉండటంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+