వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు విడాకులిచ్చిన స్వాతి.. నా కల చెదిరిపోయింది.. అతన్ని జీవితాంతం మిస్ అవుతానంటూ..

|
Google Oneindia TeluguNews

''మన జీవితంలో రంగుల కలలు ముగిసిపోవడం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. నా కల కూడా చెదిరిపోయింది. నేను, నవీన్ వేరుపడ్డాం. నిజానికి.. మంచి మనసులు కలిగినవారు కూడా ఒక్కోసారి కలిసి ఉండలేరు. నాదీ అదే పరిస్థితి. అయితే నా జీవితాంతం తనను మిస్ అవుతాను. నాలాగా కలలు చెదిరిపోయిన ప్రతి ఒక్కరికీ బాధను తట్టుకునే శక్తినివ్వాలని ఆ భగవంతుణ్ని వేడుకుంటున్నా..''అంటూ ప్రముఖ ఫెమినిస్టు, ఉద్యమకారిణి స్వాతి మలివాల్ భావోద్వేగ ప్రకటన చేశారు.

ఆమెదే రికార్డు..

ఆమెదే రికార్డు..


ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా దేశమంతటికీ సుపరిచితురాలైన స్వాతి మలివాల్(36).. తన భర్త, ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్ నవీన్ జైహింద్‌(39) నుంచి విడిపోయారు. దేశంలోనే అత్యంత పిన్న వయసులో మహిళా కమిషన్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా స్వాతి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భర్తకు విడాకులిచ్చినట్లు బుధవారం ప్రకటించిన ఆమె.. దంపతులుగా కలిసుండటంలో, విడిపోవాలనుకున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల్ని ప్రస్తావిస్తూ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు.

అన్నా ఉద్యమంలో పరిచయం..

అన్నా ఉద్యమంలో పరిచయం..

ఘజియాబాద్ లో పుట్టిపెరిగిన స్వాతి, ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎస్ఎస్ కాలేజీలో ఐటీలో డిగ్రీ చేశారు. అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె భాగం పంచుకున్నారు. ఆ ఉద్యమంలోనే ఆమెకు హర్యానాకు చెందిన నవీన్ జైహింద్ తో పరిచయం, ప్రేమ ఏర్పడ్డాయి. కొంతకాలం కలిసుండి పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. పార్టీ హర్యానా విభాగానికి నవీన్ కన్వీనర్ కాగా, ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో స్వాతికి మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి దక్కింది.

చిచ్చుపెట్టిన మీటూ..

చిచ్చుపెట్టిన మీటూ..


చిన్న వయసులోనే డీసీఎం చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన స్వాతి మలివాల్.. మహిళల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా పాటుపడ్డారు. చిన్నారులపై అత్యాచారాలు చేసేవాళ్లకు కఠినంగా శిక్షలు విధించేలా పోక్సో చట్టం రావడంలో ఆమె కృషి కూడా ఉంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇటీవలే నిరాహార దీక్ష కూడా చేపట్టారామె. కాగా, మీటూ ఉద్యమం సమయంలో స్వాతి భర్త నవీన్.. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. అప్పటి నుంచి క్రమంగా దూరమైన జంట.. బుధవారం నాటికి విడాకులు తీసుకుంది. కాగా, స్వాతి ప్రకటనపై నవీన్ ఇంకా స్పందించలేదు.

English summary
Announcing her divorce from AAP leader Naveen Jaihind on Twitter, DCW chief Swati Maliwal said, "Sometimes the best of people can't stay together. Will always miss him and our life that could have been.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X