రేపిస్టుల నరాలు కోసేయాలి, అలా చేస్తేనే మహిళలకు రక్షణ: స్వాతి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రేపిస్టులకు మరణశిక్ష విధించాలని ఢిల్లీ మహిళా కమిషన్ అద్యక్షురాలు స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళలపై జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్టపడుతోందన్నారు.

గురుగ్రామ్ లో సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ యువతిపై కారులో ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది.ఈ ఘటనపై ఆమె స్పందించారు.

rape

దేశంలో ప్రతి నిమిషానికి ఓ రేప్ జరుగుతుండడం తీవ్ర ఆందోళన కల్గిస్తోందన్నారు. ప్రతి రేపిస్టుకు మరణశిక్ష విధించడం ద్వారా భారత ప్రభుత్వం గట్టి సందేశం పంపాల్సిన అవసరం ఉందన్నారు.అత్యాచారాలకు అడ్డుకట్టపడాలంటే రేపిస్టుల నరాలు కోసేయాలన్నారు.

ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే న్యాయం అందించి రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయడమే సముచితమని స్వాతి మలివాల్ చెప్పారు. కాగా, హార్యానాలో రోహతక్ జిల్లాలో శనివారం నాడు 23 ఏళ్ళ యువతిపై గ్యాంగ్ రేప్ చేసి హత్యచేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Delhi Commission for Women (DCW) today citing the rise in the number of rape cases in the National Capital and the Nation has urged the Government to grant capital punishment to every rapist.
Please Wait while comments are loading...