క్రూరమైన నేరాలు, కిడ్నాప్‌లకు ఉరి సబబే: సుప్రీం
న్యూఢిల్లీ: క్రూరమైన, హేయమైన నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించడం అమానవీయం లేదా క్రూరత్వం కాదని, అది వారి జీవించే హక్కును ఉల్లంఘించబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముంబై పేలుళ్ల దోషి యాకుబ్‌మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసిన సమయంలో దేశవ్యాప్తంగా మరణశిక్షలపై చర్చ జరిగిన నేపథ్యంలో సుప్రీం ఈ వివరణ ఇచ్చింది.
హత్యకేసులో మరణశిక్షకు గురైన వ్యక్తి దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది.
‘హత్యకేసులో కోర్టులు చాలా అరుదుగా మరణశిక్ష విధిస్తుండవచ్చు. కానీ కొన్ని కేసుల్లో మరణశిక్షే సరైన శిక్ష అని కోర్టులు భావించినప్పుడు, ఆ అభిప్రాయాన్ని సమీక్షించడం కష్టం' అని పేర్కొంది.

నేరానికి తగిన శిక్ష విధించడమే ప్రాముఖ్యమని తెలిపింది. సాధారణ నేరస్తులే కాకుండా ఉగ్రవాదులు కూడా కిడ్నాప్‌లకు పాల్పడి డబ్బును డిమాండ్ చేస్తున్నారని, ఇటువంటి వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధించాలని పేర్కొంది.
విక్రంసింగ్ అనే నేరగాడు ఓ 16 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌చేసి, హత్యచేసిన కేసులో కింది కోర్టు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. మరణశిక్షలు కేవలం ఉగ్రవాదులకు మాత్రమే విధించాలని, డబ్బు కోసం కిడ్నాప్ చేసిన తనకు ఆ శిక్ష విధించడం సరైంది కాదన్న పిటిషనర్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications