జాలర్లకు మరణశిక్ష: ఆగ్రహం, రైల్వే ట్రాక్ కట్ (పిక్చర్స్)
మధురై: నాక్రోటిక్స్ స్మగ్లింగ్‌లో రామనాథపురానికి చెందిన ఐదుగురు జాలర్లకు శ్రీలంక కోర్టు మరణ శిక్ష విధించడంతో ఆగ్రహించిన ప్రజలు తమిళనాడులో విధ్వంసానికి దిగారు. రామేశ్వరం, పంబన్ మధ్య 900 మీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను తొలగించారు.
రైల్వే ట్రాక్‌ను తొలగించడంతో రామేశ్వరం నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాల్సిన మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను శుక్రవారానికి వాయిదా వేశారు. రైల్వే డివిజనల్ మేనేజర్ ఎకె రస్తోగి ఆ విషయం చెప్పారు.
ముత్తురామలింగ తేవర్ జయంతి సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్లలో ప్రత్యేక విధుల మీద ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. రైల్వే ట్రాక్‌ను తొలగించడంతో మూడు రైళ్లు కూడా రామేశ్వరంలో ఆగిపోయాయి. ఆగ్రహించిన ప్రజలు ఓ బస్సుకు కూడా నిప్పు పెట్టారు.

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణపై శ్రీలంక కోర్టు ఐదుగురు తమిళ జాలర్లకు మరణశిక్ష విధించింది. వారిలో విల్సన్ ఇతను..

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణపై శ్రీలంక కోర్టు ఐదుగురు తమిళ జాలర్లకు మరణశిక్ష విధించింది. వారిలో ఇతను ప్రసాద్..

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణపై ఐదుగురు జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష విధించింది. వారిలో ఆకస్తాజ్ ఇతును..

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణపై శ్రీలంక కోర్టు ఐదుగురికి మరణశిక్ష విధించింది. వారిలో ఇతను ఎమర్సన్ ఒకతను..

జాలర్లకు మరణశిక్ష
నార్కోటిక్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణపై శ్రీలంక కోర్టు ఐదుగురు తమిళ జాలర్లకు మరణశిక్ష విధించింది. వారిలో ఒకతను లాంగ్లెట్...

రైల్వే లైన్ కట్
ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష విధించడంతో ఆగ్రహించిన గుంపు రామేశ్వరం వద్ద రైల్వే లైన్‌ను కట్ చేసింది.

రైల్వే లైన్ కట్
ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక కోర్టు మరణశిక్ష విధించడంతో గుంపు రైల్వే లైన్ కట్ చేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కింది.












Click it and Unblock the Notifications