పాపం ఎనిమిదేళ్ల పిల్లోడు.. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో బలయ్యాడు.. యూపీలో మొత్తం 12 మంది మృతి

పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాంలంటూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. గురువారం కర్నాటకలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్ లో ఒకరు చనిపోగా, శుక్రవారం ఒక్క యూపీలోనే మరో ఆరుగురు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. అయితే శనివారం మధ్యాహ్నం సమయానికి ఈ సంఖ్య ఏకంగా రెట్టింపయింది. ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారనే రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు శుక్రవారం నాటి ఆందోళనల్లో ఒక్క యూపీలోనే మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలసింది.

 వారణాసిలో దారుణం.. ఎనిమిదేళ్ల బాలుడు..

వారణాసిలో దారుణం.. ఎనిమిదేళ్ల బాలుడు..

వారణాసిలో సీఏఏ వ్యతిరేక ఆందోళన కారులు, పోలీసులకు మధ్య జరగిన గలాటాలో అభంశుభం తెలియని ఎనిమిదేండ్ల బాలుడు చనిపోయాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో కిందపడిపోయి, తీవ్రంగా గాయపడ్డ ఎనిమిదేండ్ల బాలుడు.. శనివారం కన్నుమూశాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం యూపీలో చనిపోయినవారిలో మీరట్ జిల్లాకు చెందినవారు నలుగురుండగా మిగతావాళ్లు సంభాల్, కాన్పూర్, ఫిరోదాబాద్ తదితర ప్రాంతాలకు చెందినవాళ్లు.

 సీఎం యోగి ఇలాకాలో 144 సెక్షన్

సీఎం యోగి ఇలాకాలో 144 సెక్షన్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత ఇలాకా గోరఖ్ పూర్ లోనూ సీఏఏ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. శుక్రవారం మొదలైన నిరసనలు శనివారానికి మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో పోలీసులు నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించారు. యూపీలో సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తింపు ఉన్న ఇతర పట్టణాల్లోనూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీలో సీఏఏ నిరసనలు.. 10 మంది అరెస్ట్

ఢిల్లీలో సీఏఏ నిరసనలు.. 10 మంది అరెస్ట్

దేశరాజధాని ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక నిరసనలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. అయితే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేయడంతో కొంతవకు నిరసనలు కంట్రోల్ లోకి వచ్చాయి. పాత ఢిల్లీ దార్యగంజ్ ఏరియాలో నిరసన చేస్తున్న 10 మంది వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లు, పోలీసుల విధులకు ఆటంకం కల్పించడం తదితర సెక్షన్ల కింది వారిపై కేసులు నమోదయ్యాయి.

మేఘాలయలోనూ ఇంటర్నెట్ పునరుద్ధరణ

మేఘాలయలోనూ ఇంటర్నెట్ పునరుద్ధరణ


పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భగ్గుమన్న ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి. అస్సాంలో శుక్రవారం నుం చే దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొనగా, అదేరోజు ఇంటర్నెంట్ సేవల్ని పునరుద్ధరించారు. మేఘాలయలోనూ శనివారం మధ్యాహ్నం నాటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడంతో అధికారులు ఇంటర్నెంట్ సేవల్ని మళ్లీ షురూ చేశారు. దాదాపు ఎనిమిది రోజులపాటు అక్కడి ప్రజలకు నెట్ అందుబాటులో లేకుండాపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+