టీకి షాక్: పోలవరం ఆర్డినెన్స్‌కు ఆమోదం, ఆ గ్రామాలు

హైదరాబాద్: లోకసభలో శుక్రవారం మధ్యాహ్నం పోలవరం ఆర్డినెన్స్ పైన చర్చ ప్రారంభమైంది. ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పోలవరం ఆర్డినెన్స్ డిజైన్ మార్చాలని వారు డిమాండ్ చేశారు. తెరాసకు చత్తీస్‌‍గఢ్, ఒడిశా ఎంపీలు జత కలిశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెరాస ఎంపీ వినోద్ కుమార్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ఇరవై నిమిషాలలోనే మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించారు.

Debate on Polavaram in Lok Sabha

తెరాస, ఒడిశా ఎంపీల నిరసనల మధ్యే లోకసభ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం లోకసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. పోలవరం ఆర్డినెన్స్‌ను లోకసభలో ఆమోదించడంతో ముంపు గ్రామాల విలీనం చట్టబద్దం కానున్నాయి.

వినోద్ ఇచ్చిన ఆర్డర్ ఆఫ్ పాయింటును స్పీకర్ తిరస్కరించారు.

పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకమని గుత్తా అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలన్నారు.

పోలవరం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తాము పోలవరంకు వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని కోరుతున్నామన్నారు. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలన్నారు.

పోలవరం ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ వినోద్ కుమార్ తీర్మానం ఇచ్చారు.

పోలవరం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విభజన తర్వాత రాష్ట్రం అభిప్రాయం తెలియకుండా గ్రామాలను ఎలా ఆంధ్రాలో కలుపుతారని ప్రశ్నించారు. రాష్ట్ర సరిహద్దులు మార్చాలంటే అసెంబ్లీ అభిప్రాయం తీసుకోవాలన్నారు. దానికి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ముంపు మండలాల విలీనం గత ప్రభుత్వం హయాంలోనే జరిగిందన్నారు. ఆదివాసుల హక్కులను కాపాడుతామని చెప్పారు.

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. గిరిజనులకు పునరావాసం కలిపిస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఏపీలో కలిపిన మండలాలు గతంలో ఆంధ్రావేనని చెప్పారు. తెరాస, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఎంపీల నిరసన మధ్యనే చర్చను ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+