వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే చివరి మాట: రాహుల్‌ అభ్యర్థిత్వంపై సోనియా

|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం లేదనేదే తుది నిర్ణయమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఏఐసిసి సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ ప్రధాని అభ్యర్థిపై గురువారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయమే చివరిదని ఆమె తెలిపారు.

కాగా సమావేశంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని పలువురు నినాదాలు చేశారు. అయితే ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించడం ముఖ్యం కాదని, లోక్‌సభ ఎన్నికలకు తమందరం సిద్ధంగా ఉండాలని సోనియా గాంధీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విలువ కట్టుబడి ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె అన్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో సెక్యూలర్ సాంప్రదాయాన్ని కాపాడేందుకు ఇండియా కోసం పోరాడాలని ఆమె సూచించారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పడానికే ఇక్కడ తామంతా సమావేశమయ్యామని ఆమె తెలిపారు. సెక్యూలర్ సాంప్రదాయాన్ని కాపాడేందుకు వచ్చే ఎన్నికలనే యుద్ధంలో పోరాడాలని సోనియా పిలుపునిచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొందని, ప్రస్తుత పరిస్థితుల కంటే అవి ఎంతో కఠినమైనవని సోనియా తెలిపారు.

సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత తమ పార్టీదేనని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అవినీతి వ్యతిరేక బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాలని కోరుతున్నట్లు చెప్పారు. ఆర్థిక సమానత్వం కోసం ఎంజిఎన్ఆర్ఈజిఏను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన వివిధ పథకాలను ఆమె వివరించారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా సోనియా గాంధీ పిలుపునిచ్చారు.

English summary
The decision of the Congress party not to project Rahul Gandhi as its prime ministerial candidate in the forthcoming general elections is final, Congress president Sonia Gandhi said in her speech at the AICC meet in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X