నా పర్సనల్ లైఫ్ తో శశికళకు ఏం పని: నేను జయ మేనకోడలు, భయపడను !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: జయలలిత మేనకోడలు దీపా అన్నాడీఎంకే పార్టీ శశికళ కుటుంబ సభ్యుల మీద సంచల ఆరోపణలు చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన దీపా నన్ను అంతం చెయ్యడానికి శశికళ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారని బాంబు పేల్చారు.

ఆర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న దీపా జయకుమార్ స్థానిక ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. నా పర్సనల్ లైఫ్ లో శశికళ కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని, ఎంత కాలం ఇలా ఓర్చుకుని ఉండాలి అంటూ దీపా విచారం వ్యక్తం చేశారు.

శశిక ఫ్యామిలీ టార్గెట్ నేనే

శశిక ఫ్యామిలీ టార్గెట్ నేనే

తన పర్సనల్ లైఫ్ లో జోక్యం చేసుకుంటున్నారని, నన్ను నాశనం చెయ్యడానికి శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారని, ఎలాగైనా నన్ను తెరమరుగు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

నా భర్తనే నా మీదకు రెచ్చగొట్టారు

నా భర్తనే నా మీదకు రెచ్చగొట్టారు

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చెయ్యకుండా చూడాలనే నా భర్త మాధవన్ ను తన మీదకు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని, తనకు వ్యతిరేకంగా మాధవన్ తో ప్రచారం చేయించాలని ప్రయత్నించారని దీపా జయకుమార్ మండిపడ్డారు.

నేను జయ మేనకోడలు, బెదిరింపులకు భయపడను

నేను జయ మేనకోడలు, బెదిరింపులకు భయపడను

నేను జయలలిత మేనకోడలు ఎవ్వరికి భయపడను, అందుకే ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, శశికళ కుటుంబ సభ్యులు ఎన్ని కుట్రలు చేసినా ఆర్ కే నగర్ నియోజక వర్గంలోని అమ్మ అభిమానులు నన్ను ఆదరిస్తున్నారని దీపా అన్నారు.

నా వెనుక అమ్మ అభిమానులు ఉన్నారు

నా వెనుక అమ్మ అభిమానులు ఉన్నారు

శశికళ వర్గానికి డబ్బు, అధికారం ఉంటే నాకు అండగా ఆర్ కే నగర్ నియోజక వర్గ ప్రజలు ఉన్నారని దీపా జయకుమార్ చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను భయపడే ప్రసక్తేలేదని, ధైర్యంగా ప్రజల్లోకి వెలుతానని దీపా జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు.

నేను అమ్మ దారిలోనే

నేను అమ్మ దారిలోనే

జయలలిత ఆశయాలు, అమ్మ అభిమానుల కోరికమేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, కార్యకర్తలకు అండగా ఉంటానని దీపా అన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తియ్యడానికి, తమిళనాడు ప్రజల్లో తనను చలకనగా చూపించాలని శశికళ వర్గం కుట్రలు చేస్తోందని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో చిన్నమ్మ వర్గం మీద దీపా జయకుమార్ విరుచుకుపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deepa accuses that Sasikala and her family frequently creating problem in my life. They want to kill me at any cost said deepa.
Please Wait while comments are loading...