వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ బంగ్లా ముందు దీపా అభిమానుల ఆందోళన, శశికళకు చాన్స్ ఇవ్వద్దు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చెయ్యడానికి అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేస్తూ జయలలిత మేనకోడులు దీపా మద్దతుదారులు సోమవారం చెన్నైలోని గవర్నర్ బంగ్లా ముందు ఆందోళన నిర్వహించారు.

శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జయలలితను మోసం చేసిన శశికళ ఆమె ఆస్తులు అన్నీ స్వాధీనం చేసుకున్నారని, అమ్మకు నిజమైన వారసురాలు నేనే అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి తీసుకున్నారని మండిపడ్డారు.

Deepa’s supporters staged a protest against Sasikala at residence of governor at Guindy today.

అదిచాలక ఇప్పుడు జయలలితకు ఎంతో నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వంను బలిపశుపు చేశఆరని ఆరోపించారు. సీఎం కావాలని చూస్తున్న శశికళ కుట్రలు అడ్డుకోవాలని గవర్నర్ కు మనవి చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే ముందుగా గవర్నర్ నుంచి అనుమతి లేకపోవడంతో వారిని బంగ్లాలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

శశికళకు, మన్నార్ గుడి మాఫియాకు వ్యతిరేకంగా గవర్నర్ బంగ్లా ముందు దీపా పేరవై సంస్థ నాయకులు, ఆమె అభిమానులు ధర్నా చేశారు. దీపా అభిమానులను పోలీసులు అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో శశికళకు వ్యతిరేకంగా దీపా అభిమానులు నినాదాలు చేశారు.

English summary
Jayalalithaa’s niece Deepa’s supporters staged a protest against Sasikala at residence of governor at Guindy today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X