• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సడెన్ బ్రేక్.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌తో దీపికా షో వాయిదా.. అదే కారణమా..?

|

అనవసర అపోహలు, భయం, ఆందోళన కారణంగా కరోనా లాక్ డౌన్ పీరియడ్‌లో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళల్లో ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకు దారితీస్తుండగా.. పురుషుల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పీరియడ్‌లో మానసిక ప్రశాంతత,మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్‌,బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణేతో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లైవ్ షో ప్లాన్ చేశారు. షెడ్యూల్ ప్రకారం గురువారం(ఏప్రిల్ 23) ఇది జరగాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల వాయిదాపడింది.

కరోనా దెబ్బకు మామిడి రైతు విలవిల .. లాక్ డౌన్ తో కొనసాగని మామిడి ఎగుమతులు

లైవ్ షో వాయిదా.. దీపికా పదుకొణే క్లారిటీ..

లైవ్ షో వాయిదా.. దీపికా పదుకొణే క్లారిటీ..

డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌ టెడ్రోస్‌తో లైవ్ షో వాయిదా పడటంపై దీపికా పదుకొణే తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. 'కరోనా సమయంలో మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత అనే కార్యక్రమం ఊహించని మరియు అనివార్య కారణాల చేత వాయిదా పడింది. తదుపరి సమాచారం వచ్చేంతవరకు దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.' అని దీపికా స్పష్టం చేశారు. అయితే ఇంతకుముందే చెప్పినట్టు... కరోనా తరుముతున్న ఈ కష్టకాలంలో మానసిక ఆరోగ్యం అనేది అత్యంత కీలకమని చెప్పారు. కాబట్టి మీరంతా మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యామిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

అదే కారణమా..

డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌తో దీపికా లైవ్‌ షోపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత,విమర్శలు వచ్చాయి. దీపికా నిర్ణయంపై నెటిజెన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాపై అతివిశ్వాసానికి పోయి.. ప్రపంచం మొత్తాన్ని ముప్పులోకి నెట్టిన వ్యక్తితో షో చేయడమేంటని ప్రశ్నించారు. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే ఇప్పుడీ సమస్య జటిలందమైన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తితో లైవ్ షో చేయడం కంటే మీరే స్వయంగా ఓ లైవ్ సెషన్ చేయండని కొందరు నెటిజెన్స్ సూచించారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌తో దీపికా లైవ్ షో వాయిదా పడటానికి నెటిజెన్ల విమర్శలే కారణమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  Ram Gopal Varma Mocks Trump Claim || Oneindia
  ఒకప్పుడు దీపిక కూడా..

  ఒకప్పుడు దీపిక కూడా..

  ఒకప్పుడు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లి.. ఆ తర్వాత దాన్ని అధిగమించిన అనుభవం దీపికాకు ఉంది. అంతేకాదు, 'లివ్,లవ్,లాఫ్' అనే ఫౌండేషన్‌ను స్థాపించి డిప్రెషన్‌తో బాధపడుతున్నవారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు. ఇంత డబ్బు,పలుకుబడి ఉన్న తానే డిప్రెషన్‌కు గురై ఉక్కిరిబిక్కిరి అయ్యానంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటా అని ఆలోచించానని.. అందులో నుంచే ఈ ఫౌండేషన్ ఆలోచన పుట్టిందని గతంలో వెల్లడించారు. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు మానసిక స్థైర్యం ఎంత అవసరమో ఆమెకు తెలుసు. కాబట్టే డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైతం దీపికాతో దానిపై కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఇప్పుడది వాయిదా పడింది. అంతకుముందు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ దీపికాకు 'సేఫ్ హ్యాండ్స్' ఛాలెంజ్‌ విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన దీపికా.. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

  English summary
  Deepika Padukone was scheduled to have a live conversation with the Director-General of the World Health Organization (WHO) to talk about mental health issues during the pandemic, on Thursday, 23 April. However, the chat has now been put on hold until further notice due to ‘highly unavoidable circumstances.’
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X