అమెరికా నుంచి భారత్ కు ఎం 777 ఆయుధాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అమెరికా నుంచి మన దేశాలనికి భారీ ఎత్తున ఆయుధాలు సరఫరా చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది. అమెరికాతో రూ. 5,000 కోట్ల విలువైన ఎం 777 తరహా అతి తేలికైన హోవిట్టర్ గన్స్ కొనుగోలు చెయ్యడానికి భారత్ ఒప్పందం చేసుకుంది.

అమెరికా నుంచి ఈ ఎం 777 తరహా గన్స్ కొనుగోలుకు సంబంధించి లెటర్ ఆఫ్ యాక్సెఫ్టెన్స్ మీద భారత్ ఇప్పటికే సంతకం చేసింది. మొత్తం 145 గన్స్ కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది.

ఇదే ఏడాది జూన్ చివరిలో భారత-అమెరికా సైనిక సహకార బృందం 15వ సమావేశం సందర్బంగా ఈ ఒప్పందం కుదిరింది. ఎం 777 తరహా గన్స్ కొనుగోలుకు తాము ఆసక్తిగా ఉన్నామంటూ బారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికాకు లేఖ పంపించింది.

ఎం 777 తరహా గన్స్ బరువు చాల తక్కువగా ఉండటంతో వాటిని హెలికాప్టర్లలో తరలించి చైనా సరిహద్దులోని లడఖ్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో మోహరించడానికి వీలు ఉంటుందని అధికారులు అంటున్నారు.

Defence Ministry nod to buy 145 ultra light Howitzers from US

అందుకు అమెరికా కూడా స్పందించడంతో ఒప్పందం కుదిరింది. మొదట 25 గన్స్ భారత్ వస్తాయి. మొదటి ఆరు నెలల్లో రెండు హోవిట్జర్లను భారత్ కు అందిస్తారు. తరువాత మిగిలిన 23 గన్స్ నెలకు రెండు చొప్పున అందిస్తారు.

మిగిలిన గన్స్ మహింద్రా సంస్థ భాగస్వామ్యంతో ఇక్కడే ఏర్పాటు చేసే అసెంబ్లీ ఇంటిగ్రేసన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీలో అసెంబల్ చేస్తారు. మొత్తం మీద శత్రుదేశాలకు సరైన సమయంలో బుద్ది చెప్పడానికి ఇలాంటి అత్యాధునికమైన ఆల్ట్రా లైట్ హోవిట్జర్లు ను భారత్ కొనుగోలు చేస్తున్నది.

1980లో బయటపడిన బోఫోర్స్ స్కాం తరువాత ఈ తరహా అర్టిలరీ గన్స్ కొనుగోలుకు జరిగిన మొట్టమొదటి ఒప్పందం ఇది. ఈ ఒప్పందం కుదుర్చుకొవడానికి కేంద్ర ప్రభుత్వం చాల కాలం కసరత్తులు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Defence Ministry on Saturday approved the much delayed purchase of 145 Ultra Light Howitzers, worth about Rs 5,000 crore, from the US and also the bulk production of 18 Dhanush artillery guns.
Please Wait while comments are loading...