Bihar Polls: బీహార్ మహాకూటమిదే.. ! లెక్కలతో సహా చెప్పిన తేజస్వీ..!
బీహార్ లో రెండు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయం అంటూ నిన్న ముక్తకంఠంతో ఎగ్జిట్ పోల్స్ చెప్పడాన్ని మహాకూటమి సీఎం అభ్యర్ధి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తప్పుబట్టారు. గతంలో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో కుమ్మక్కై మీడియా వెలువరించిన రిపోర్టుల్ని ఆయన ప్రస్తావించారు. 2020తో పోలిస్తే ఈసారి బీహార్ లో 72 లక్షల మంది ఓటర్లు ఎక్కువగా ఓటేశారని ఆయన గుర్తుచేశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతే అన్నారు.
ఇది నితీష్ కుమార్‌కు మద్దతు కాదు, మార్పు కోసం ప్రజల కోరికను సూచిస్తోందని తేజస్వీ యాదవ్ వెల్లడించారు. ఈ ఓటు ప్రభుత్వాన్ని మార్చడానికే అన్నారు. ఎన్డీయే విజయం సాధిస్తుందన్న అంచనాలను ఆయన తోసిపుచ్చారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, 76 లక్షల మంది ఎక్కువగా ఓటు వేశారని, 243 అసెంబ్లీ నియోజకవర్గాలతో దీన్ని విభజిస్తే ప్రతీ చోటా 29వేల మంది ఎక్కువగా ఓటేశారని తేజస్వీ తెలిపారు. ఈ లెక్కన తమకు 160పైగా సీట్లు రాబోతున్నట్లు తేజస్వి అంచనా వేశారు.

ఈ భారీ ఓటు మార్పు కోసం అన్నారు. ప్రభుత్వం మారబోతోందని, 76 లక్షల ఓట్లు నితీష్ కుమార్‌ను కాపాడటానికి కాదు, ఆయన ప్రభుత్వాన్ని మార్చడానికే అని తేజస్వీ యాదవ్ తెలిపారు. ఎన్డీఏ ఓట్ల లెక్కింపును నెమ్మదింపజేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రజలలో భయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తుందన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు.

अपना ये है आज नहीं मानोगे तो 14 नवंबर को तो मानना पड़ेगा ।
— Rajeev Ranjan ( राजीव रंजन कोइरी ) (@YuvasochRajeev) November 11, 2025
महागठबंधन-132 , एनडीए 103 #ExitPolls | #BiharElection2025 | #ExitPoll pic.twitter.com/1AMXHXzH3e
ఇటీవల ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 8 మంది చనిపోయిన ఘటనపై ఆయన కేంద్రాన్ని విమర్శించారు. ఈసారి ఎన్డీయే ఓట్ల లెక్కింపును నెమ్మదింపజేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని, జిల్లా ప్రధాన కార్యాలయంలో భయాన్ని సృష్టిస్తారని, బాంబు పేలుడు జరిగిన చోట వారు ఏమీ చేయరని తెలిపారు. కానీ ప్రజల్లో భయం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి వారు బీహార్‌లోని అన్ని జిల్లాల్లో సైనిక జెండా కవాతు నిర్వహిస్తారన్నారు. 2020 ఎన్నికలలో కూడా మోడీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అప్పట్లో ఇరు కూటముల మధ్య ఓట్ల తేడా 12 వేలే ఉండటంతో అవి ఫలించాయన్నారు. ఈసారి తాము క్లీన్ స్వీప్ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications