Monsoons: ముగిసిన వానకాలం సీజన్.. లోటు వర్షపాతం నమోదు..
దేశంలో వర్షాకాలం సీజన్ ముగిసింది. ఎల్ నినో పరిస్థితులతో దేశంలో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD)ప్రకారం సెప్టెంబర్ 30న రుతుపవనాలు వెళ్లిపోయాయి. దేశంలోని ప్రధాన భూభాగంలో రుతుపవనాలు నాలుగు నెలల కాలంలో తక్కువ వర్షపాతం నమోదయింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు - 820 మిమీ, ఇది దీర్ఘకాల సగటు (LPA) 868.6 మిమీ కంటే తక్కువ. రుతుపవనాలలో మొత్తం వర్షపాతం 2021లో "సాధారణం కంటే ఎక్కువ" ఉంది.
సాధారణగా ఒక సీజన్ లో సగటు వర్షపాతం 94 నుంచి 106 శాతం మధ్య కురిస్తే సాధారణంగా పరిగణిస్తారు. అయితే దేశంలో ఈసారి సరాసరిన 91శాతం వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఎల్ నినో ఉన్నా కూడా పలు ప్రాంతాల్లో వర్షపాతం భాగానే నమోదయింది. 73 శాతం ఏరియాల్లో 18% లోటు వర్షపాతం నమోదయింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 1,115 మి.మీ. వర్షపాతం నమోదు కాగా ఇక్కడ సాధారణం 1,367 మి.మీ.గా ఉంది.

అయితే నైరుతి రుతుపవనాల చివరి భాగంలో ఎల్ నినో ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. భారతీయ రుతుపవనాలు వివిధ సహజ కారకాల కారణంగా కాలక్రమేణా సంభవించే స్వాభావిక హెచ్చుతగ్గులు, మార్పులను సూచిస్తుంది. దీనిని సహజ వైవిధ్యం అంటారు. జూన్‌లో దేశవ్యాప్తంగా నెలవారీ వర్షపాతం జూన్‌లో 91 శాతం, జూలైలో 113 శాతం, ఆగస్టులో 64 శాతం, సెప్టెంబర్‌లో 113 శాతంగా నమోదైందని IMD చీఫ్ చెప్పారు.












Click it and Unblock the Notifications