Delhi : మంచు కారణంగా..134 విమానాలు, 22 రైళ్ల రాకపోకలకు అంతరాయం..
Delhi : మంచు కారణంగా..134 విమానాలు, 22 రైళ్ల రాకపోకలకు అంతరాయం : దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో 134 విమానాలు, 22రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు రాజధానిని కమ్మేసింది. దీంతో ఉదయం వేళలో రోడ్డు కనపడక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా దేశీయ అంతర్జాతీయ విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ దట్టమైన పొగమంచు వల్ల రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఢిల్లీలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 6డిగ్రీల సెల్సియస్‌కు చేరిపోయింది. ఉదయం 5.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్‌లో విజిబిలిటీ 25 మీటర్లు మాత్రమే ఉండడం విశేషం. ఈ నగరాలతో పాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో కూడా డిసెంబర్ 31 వరకు పొగమంచు మరింత తీవ్రంగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. డిసెంబర్ 31 తర్వాతనే ప్రజలకు పొగమంచు నుంచి కొంత ఉపశమనం లభించవచ్చని ఐఎండీ వివరించింది.

విజిబిలిటీ కారణంగా 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని భారతీయ రైల్వే కూడా ప్రకటించింది. ఈ రైళ్ల జాబితాలో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఉన్నాయి. ఢిల్లీ ప్రజలను ఇప్పటికే చలిగాలులు వణికిస్తున్నాయి. ఇక, ఈ చలి తీవ్రత డిసెంబర్ 31 వరకు తప్పదని వాతావరణ శాఖ అంటోంది. పొగమంచుతో రోడ్లపై వాహనాదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 134 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
డిసెంబర్ 31వరకు కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు : ఢిల్లీలో చలి తీవ్రత కారణంగా పాఠశాలల సమయాలలో కూడా కొన్ని మార్పులు చేశారు. దేశ రాజధానికి పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో వివిధ నగరాల్లోని పాఠశాలలకు ఏకంగా సెలవులనే ప్రకటించేసింది. ఘజియాబాద్‌లో అయితే 1-8వ తరగతి వరకు అన్ని పాఠశాలల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ పరిధిలోని పాఠశాలలను గురువారం, శుక్రవారం మూసివేశారు. ఇంకా మథుర నగరంలో పాఠశాల తరగతుల సమయాన్ని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్చడం జరిగింది. ఇంకా మిగిలిన కొన్ని పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications