ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిధిలాల క్రింద జనం!
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. .ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇటీవలే ఒక భవనం కుప్పకూలగా తాజాగా మరొక సంఘటన చోటు చేసుకోవడం ఢిల్లీ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది.
ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల బిల్డింగ్
అయితే ఈ బిల్డింగ్ శిథిలాల కింద 12 మంది వరకు చిక్కుకున్నారని సమాచారం. బిల్డింగ్ కూలిపోయిన ఘటన తర్వాత సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం ప్రస్తుతం సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో నలుగురుని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

#WATCH | Delhi: Search and rescue operations underway by the fire department with the help of locals, after a ground-plus-three building collapses in Delhi's Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. Further details awaited. pic.twitter.com/F44wJBtyG4
— ANI (@ANI) July 12, 2025
రంగంలోకి ఏడు అగ్నిమాపక బృందాలు, రెస్క్యూ టీం లు
ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శిధిలాల కింద ఉన్న అందరిని బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏడు అగ్నిమాపక బృందాలు, రెస్క్యూ టీం లు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి కారణాలు ఇప్పటివరకు తెలియ రాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WATCH | Delhi: Anees Ahmad Ansari, whose house was damaged due to building collapse, says, "Everyone was sleeping, when at around 7 am, the building collapsed on one side of my house and its debris crashed into my house. Suddenly, there was a blackout. 4-5 people are still… https://t.co/YC4dTKqtub pic.twitter.com/Z5BOSVqooE
— ANI (@ANI) July 12, 2025
శిధిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీసే యత్నం
నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న భవనాలపైన పడింది. దీంతో ఆ ఇళ్ళు కూడా బాగా దెబ్బతిన్నాయి. స్థానికులు కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలలో పాల్గొంటూ శిధిలాల కింద ఉన్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న క్రమంలో ఈ సంఘటన పైన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Delhi: Search and rescue operations underway by the fire department and civil defence teams, with the help of locals, after a ground-plus-three building collapses in Delhi's Seelampur. pic.twitter.com/4xVzZ0Dutf
— ANI (@ANI) July 12, 2025
ఢిల్లీలో వరుస ఘటనలు.. ఆందోళనలో స్థానికులు
కాగా ఇటీవల నిన్న తెల్లవారుజామున ఆజాద్ మార్కెట్ ఏరియాలో ఒక బిల్డింగు కుప్పకూలింది. ఈ ఘటనలో 45 సంవత్సరాల పప్పు అనే వ్యక్తి చనిపోయాడు బిల్డింగ్ సమీపంలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో మెట్రో పనుల కారణంగా బిల్డింగ్ కుప్పకూలి ఉండవచ్చని అధికారులు భావించారు. ఈ ఘటన మరిచిపోకముందే మళ్లీ నేడు నాలుగంతస్తుల బిల్డింగు కుప్పకూలడం స్థానికులకు ఆందోళన కలిగిస్తుంది.
#WATCH | Delhi: Additional DCP, North-East District, Sandeep Lamba says, "We received a call around 7:30 am about a three-story building collapse in Gali No. 5 in Janta Colony in the Welcome area. This building belonged to a person called Matloof. The building in front of this… https://t.co/hfVquzKBQ4 pic.twitter.com/tZFkK28BLL
— ANI (@ANI) July 12, 2025
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications