వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన కోచింగ్ సెంటర్ భవనం: ఐదుగురు మృతి, 13మందికి తీవ్రగాయాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. భజన్‌పురాలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. పైకప్పు కూలిన ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మృతుల్లో నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. క్లాసులు జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం జరిగింది.

 Delhi: 5 dead, 13 injured as roof collapses in Bhajanpura

మూడంతస్తుల భవనం రెండవ, మూడవ అంతస్తులో నిర్మాణం జరుగుతోందని.. శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఆకస్మాత్తుగా భవనం పైకప్పు కుప్పకూలిపోయిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రక్షణ సహాయక చర్యలను చేపట్టడానికి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.

ఘటనా స్థలంలో ఏడుగురుని కాపాడాయని చెప్పారు. సుమారు మరో 15 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, మరికొద్ది సేపట్లో ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

English summary
An under-construction building in Bhajanpura area of New Delhi collapsed on Saturday as a coaching centre was being run in the building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X