జెట్ ఎయిర్ వేస్ విమానానికి బెదిరింపులు: అహ్మదాబాద్‌కు మళ్లింపు
ఢిల్లీకి వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని భద్రతా కారణాల వల్ల సోమవారం ముంబై నుండి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు.
Recommended Video

జెట్ ఎయిర్ వేస్ విమానానికి బెదిరింపులు | Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని భద్రతా కారణాల వల్ల సోమవారం ముంబై నుండి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు.
9W339 విమానం ఆదివారం దాటిన తర్వాత సోమవారం అర్ధరాత్రి గం.2.55 నిమిషాలకు ముంబైలో టేకాఫ్ తీసుకుంది. అనంతరం అహ్మదాబాదులో గం.3.45 నిమిషాలకు ల్యాండ్ అయింది.

భద్రతా కారణాల వల్ల విమానాన్ని మళ్లించినట్లు ప్రయాణీకులు చెప్పారని తెలుస్తోంది. కాగా, వాష్‌రూంలో ఎయిర్ హోస్టెస్ ఓ బెదిరింపు లేఖను గుర్తించారు. విమానంలో హైజాకర్స్, పేలుడు పదార్థాలు ఉన్నాయని లేఖలో ఉండటంతో మళ్లించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications