Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్రమ రవాణా: 16మంది యువతులకు విముక్తి కల్పించిన డీసీడబ్ల్యూ

న్యూఢిల్లీ: అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 16 మంది యువతులను ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్య్లూ) కాపాడింది. పోలీసుల సాయంతో ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒక్కసారిగా దాడులు జరిపి వీరిని కాపాడింది.

Delhi Commission for Women rescues 16 girls trafficked from Nepal

నేపాల్‌ నుంచి వీరందరినీ ఢిల్లీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇరాక్‌, కువైట్‌ తరలించేందుకు ఉంచగా తాము రక్షించామని డీసీడబ్ల్యూ ఛైర్మన్‌ స్వాతి మలివాల్‌ తెలిపారు. బాధిత యువతుల నుంచి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్న అక్రమార్కులు వారిని ఓ చిన్న గదిలో బంధించారని చెప్పారు.

అక్కడ్నుంచి తాము రక్షించామని స్వాతి మలివాల్ తెలిపారు. గత 8 నెలలుగా యువతుల అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోందని, 15 రోజుల క్రితం ఏడుగురు మహిళలను కువైట్‌ తరలించారని చెప్పారు. కాగా, ఢిల్లీలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే లెఫ్ట్‌నెట్ గవర్నర్, పోలీసులు, కేంద్రం ఏం చేస్తోందంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+