దొంగ మొగుడు, చోరీ చేసి జైలుకు, నీడలా వెంటాడి, ఇంట్లో చోరీ చేసి, భార్యపై బలవంతంగా లైంగికదాడి..

అప్పుడప్పుడు చిత్ర, విచిత్ర కేసులు కోర్టు ముందుకొస్తుంటాయి. అలాగే ఢిల్లీ కోర్టు వద్దకు కూడా ఓ కేసు వచ్చింది. అయితే దొంగ అయిన భర్త గురించి భార్య కోర్టును ఆశ్రయించడం విశేషం. ఇందులో తనపై లైంగికదాడి చేశాడని పేర్కొని వార్తల్లో నిలిచారు. దేశ రాజధానిలో జరిగిన ఘటన చర్చకు దారితీసింది.

పంజాబ్ టు ఢిల్లీ

పంజాబ్ టు ఢిల్లీ

పంజాబ్‌కు చెందిన ఓ జంట కలిసి ఉంటోంది. వారికి 2015 నవంబర్ రెండో తేదీన వివాహామైంది. భర్త గురించి సరిగా తెలుసుకోలేకపోయారే ఏమో కానీ.. అతడు దొంగ అని తర్వాత తెలిసింది. ఓ కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమెకు విషయం తెలిసింది. తన జీవితం నాశనమైంది అనుకొని.. భర్త నుంచి దూరంగా ఢిల్లీ వచ్చేసింది.

ఇంట్లో చోరీ..

ఇంట్లో చోరీ..

అయితే తాళి కట్టిన భర్త మాత్రం నీడలా వెంటాడాడు. తన భార్య ఉంటోన్న ఢిల్లీకి కూడా వచ్చాడు. ఇకనుంచి అలా చేయనని భార్యతో చెప్పాడు. మళ్లీ కలిసే ఉండటం ప్రారంభించారు. తర్వాత వారి మధ్య శారీరక సంబంధం కూడా కొనసాగింది. కానీ తన దొంగబుద్ది మాత్రం పోనివ్వలేదు. భార్య దగ్గర నుంచి రూ.2 లక్షలను దోచుకెళ్లాడు. తన సొంత ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత భర్తపై మరింత కోపం పెంచుకుంది భార్య. అతనిని తన ఇంట్లోకి రానీవ్వలేదు. కానీ మనోడు వింటాడా.. ఊరుకోలేదు.

పీఎస్ నుంచి ఇంటికి

పీఎస్ నుంచి ఇంటికి

అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అరెస్ట్ చేశారు. తర్వాత ఇంటికొచ్చిన భర్త.. భార్యతో కలిసి బలవంతంగా శారీరక సంబంధం కొనసాగించాడు. అయితే ఇంట్లోంచి డబ్బులు పోకముందు భార్యభర్తల మధ్య శారీరక సంబంధం సంతృప్తితో సాగింది. ఎప్పుడైతే రూ.2 లక్షలు దొచుకున్నాడో.. ఇక అప్పటినుంచి బలవంతంగా భర్త కాపురం చేయడం ప్రారంభించాడు.

పోలీసులు కాదని కోర్టుకు

పోలీసులు కాదని కోర్టుకు

దీనిపై మళ్లీ పోలీసులకు కాకుండా.. ఈసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బాధితురాలు. కానీ కోర్టు కేసు తీవ్రత, డేట్ లైన్ గమనించింది. వారిద్దరూ ఎప్పుడూ సఖ్యంగా ఉన్నారు, ఎప్పుడూ విభేదించారనే అంశాలను నిశీతంగా పరిశీలించారు. తనపై లైంగికదాడి చేశాడని భార్య ఫిర్యాదు చేసిన 2016 జూలై 5వ తేదీన కూడా ఆయన భర్తేనని ఢిల్లీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జీ ఉమెద్ సింగ్ గ్రెవల్ అభిప్రాయపడ్డారు.

 భర్తగా..

భర్తగా..

కేసులో బాధితురాలి చెప్పిన అంశాల ఆధారంగా పరిశీలించి చూశామని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆ సమయంలో కూడా ఓ భర్తగా దగ్గరకొచ్చాడని, ఇందులో లైంగికదాడి ఏమీ లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో భర్తను నిర్దోషిగా వదిలేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+