కుతుబ్ మినార్ స్థలం హిందువులదా? ముస్లింలదా?: పూజలు చేయవచ్చా?: తీర్పుపై ఉత్కంఠత
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన వారణాశిలో గల జ్ఞాన్‌వాపి మసీదులో హిందువులు పూజలను నిర్వహించడంపై వారణాశి జిల్లా న్యాయస్థానం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. మసీదులో హిందువులు పూజలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను విచారణకు స్వీకరించడానికి న్యాయస్థానం అంగీకరించలేదు. ఈ పిటీషన్‌ను తోసిపుచ్చింది. అంజుమన్ కమిటీ దాఖలు చేసిన పిటీషన్ ఇది.

శివాలయం శిథిలాలపై..
జ్ఞాన్‌వాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాల వాదన. దీనికి సంబంధించిన పలు సాక్ష్యాధారాలను వారు న్యాయస్థానానికి సమర్పించారు. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వారు న్యాయస్థానానికి వివరించారు. అక్కడ పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ మేరకు వారు దాఖలు చేసిన పిటీషన్‌ను వారణాశి జిల్లా న్యాయస్థానం సింగిల్ బెంచ్ జడ్జ్ జస్టిస్ అజయ్ కృష్ణ విశ్వేశ్వ్ విచారణ చేపట్టారు. దీనికి కౌంటర్‌గా అంజుమన్ ఇంతెజామియా మసీద్ మేనేజ్‌మెంట్ కమిటీ దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించలేదు.

కుతుబ్ మినార్ స్థల యాజమాన్యంపై..
ఇప్పుడిక అదే తరహా పరిస్థితి దేశ రాజధానిలోని చారిత్రాత్మక కుతుబ్ మినార్‌లో ఏర్పడింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందువులు, జైనులు పూజలు నిర్వహించడానికి వీలుగా ఆదేశాలను జారీ చేయాలంటూ ఢిల్లీ సాకేత్ కోర్టులో పిటీషన్ దాఖలైంది. కువర్ మహేంద్ర ధ్వజ ప్రసాద్ సింగ్ దాఖలు ఈ పిటీషన్ వేశారు.

హిందూ దేవత విగ్రహాల పునఃప్రతిష్ట..
ల్యాండ్ టైటిల్ క్లెయిమ్ పిటిషన్‌తో పాటు కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లోపల హిందూ, జైన దేవతలను పునఃప్రతిష్ఠించాలని విజ్ఞప్తి చేశారు. దేవత మూర్తులకు పూజలు నిర్వహించే హక్కును కల్పించాలని కోరారు. దీనిపై సాకేత్ కోర్ట్ విచారణ జరిపింది. వాదోపవాదాలను ముగించింది. న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్ తీర్పును రిజర్వ్ చేశారు. కువర్ మహేంద్ర సింగ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎంఎల్ శర్మ తన వాదనలను వినిపించారు.

ఆ స్థలం తనదిగా..
1947లో తన అనుమతి లేకుండా మొత్తం ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మహేంద్ర సింగ్ తరఫు న్యాయవాది చెప్పారు. కుతుబ్ మినార్ హక్కులకు సంబంధించి, వివిధ రాష్ట్రాల్లో తన ఆస్తుల గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశామని అన్నారు. ఈ స్థలాన్ని ఎలా స్వాధీనం చేసుకుందనే విషయాన్ని ఏఎస్ఐ తన సమాధానంలో పేర్కొనలేదని వివరించారు. ఏఎస్ఐ తరపున అమిత సచ్‌దేవ దాఖలు చేసిన పిటిషన్‌పై తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications