వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు: ఆర్ కే పచౌరీకి ఎదురు దెబ్బ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ప్రముఖ పర్యావరణ వేత్త ఆర్ కే. పచౌరికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన మీద ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన చార్జ్ షీట్ ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది.

ఆర్ కే. పచౌరికి వ్యతిరేకంగా కేసు విచారణను ముందుకు సాగించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్బంగా పేర్కొంది. ఆర్ కే. పచౌరి చార్జిషీట్ పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ శివానీ చౌహాన్ ఈ కేసు విచారణను జూలై 11వ తేదికి వాయిదా వేశారు.

ఆర్ కే పచౌరీ

ఇంధన వనరుల పరిశోధన సంస్థ (టెరి) అధిపతిగా ఉన్నప్పుడు ఆ సంస్థలోని ఓ మహిళా ఉద్యోగినిపై ఆర్ కే. పచౌరి దాడి చేసి లైంగికంగా వేధింపులకు గురి చేశాడని, ఆమెను వెంటాడి వేధించాడని, ఆమె పరువుకు భంగం కలిలించేలా ప్రవర్తించాడని పోలీసులు ఆయన మీద కేసులు నమోదు చేశారు.

ఐపీసీ సెక్షన్ ల కింద ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఆయన మీద పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 2015 లో బాధితురాలి మీద లైంగిక వేధింపులు జరిగాయని కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల వివరాలను తెలుసుకున్న న్యాయస్థానం విచారణకు అంగీకరించింది.

English summary
A Delhi court on Saturday took a cognizance of charge sheet filed against ex-chief of TERI RK Pachauri for allegedly sexually harassing a former woman colleague.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X