డేంజరస్ డెల్టా: 80 శాతం కేసులు, ఎక్కడ అంటే
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో ఎక్కువమంది డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు జీనోమ్ సీక్వెన్సింగ్‌లో తేలింది. 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ గుర్తించారు. ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటు చేసిన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఆరోగ్యశాఖకు వివరాలు తెలిపింది.
ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 83.3 శాతం శాంపిల్స్‌లో డెల్టా వేరియంట్ (B.1.617.2) గుర్తించినట్లు వెల్లడించింది. మే నెలలో 81.7, జూన్‌లో 88.6, ఏప్రిల్‌లో 53.9 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ బారినపడ్డట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC)లో ఢిల్లీ నుంచి 5,752 శాంపిల్స్‌లో 1,689లో డెల్టా, 947 నమూనాలు ఆల్ఫా వేరియంట్ కేసులు రికార్డయ్యాయి.
ఈ రెండు వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లిష్టమైన వేరియంట్లుగా వర్గీకరించింది. గతేడాది డిసెంబర్‌లో భారత్‌లో గుర్తించిన వేరియంట్ ఇప్పటికీ 95కిపైగా దేశాలకు పాకింది. రెండో దశ ఉధృతికి డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని గుర్తించారు. లక్షలాది మంది జనం వేరియంట్ బారినపడగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్ఫా వేరియంట్‌ను గతేడాది యూకేలో కనుగొన్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 25,066కు పెరిగింది. ఢిల్లీలో 24 గంటల్లో ఒక్క మరణం నమోదు కాకపోవడం వారంలో ఇది మూడోసారి.

ఇక వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications