Coronavirus: ఢిల్లీ నుంచి వెళ్లేందుకు వలసదారుల యత్నం, వసతి కల్పిస్తామని మనీశ్ సిసోడియా హామీ..
కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం నాటికి 724కి చేరుకోగా.. చనిపోయిన వారి సంఖ్య 17కి చేరుకుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కొందరు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న కొందరు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వారితో మాట్లాడారు. ప్రస్తుతం వైరస్ ప్రబలుతోందని ఈ సమయంలో స్వస్థలాలకు వెళ్లడం మంచిది కాదు అని సిసోడియా అన్నారు. వలసదారులతో మాట్లాడి.. ఒప్పించారు. ఢిల్లీలో గల నైట్ షెల్టర్‌లో ఉండాలని కోరారు. వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. రోడ్డుపై ఎలాంటి వాహనాలు నడవడం లేదని వారికి చెప్పి.. నైట్ షెల్టర్‌కు తరలించేందుకు కృషిచేశారు.

మరోవైపు ఢిల్లీ-యూపీ సరిహద్దులో భారీగా జనం వెళుతున్నారు. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో సరిహద్దు గుండా చాలామంది బయల్దేరారు. మరో వీడియో వైరలవుతోంది. అయితే వీరు ఎవరూ.. ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతున్నారనే అంశంపై మాత్రం స్పష్టత లేదు.
Dy CM @msisodia reaches out to the migrants who are 'walking' back to their states.
— Vipin Rathaur (@VipinRathaur) March 27, 2020
Manish Sisodia asked them to stay in the night shelters of Delhi Govt and govt will take care of everything.
pic.twitter.com/5ioszABQnj
Scenes at Delhi UP Border ... pic.twitter.com/OOwxKbRnKk
— Naveen Kapoor ANI (@IamNaveenKapoor) March 27, 2020












Click it and Unblock the Notifications