వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంతంగా ఢిల్లీ ఎన్నికల పోలింగ్: 65శాతం పోలింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సిఎం అభ్యర్థి అరవింద్ కేజ్రివాల్, భారతీయ జనతా పార్టీ సిఎం అభ్యర్థి కిరణ్ బేడీ తోపాటు 673 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్గంరం 5.30గంటల వరకు 65శాతం ఓటింగ్ నమోదైంది.

Delhi election 2015: Polling for 70 assembly seats starts

ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతోపాటు బిజెపి సిఎం అభ్యర్థి కిరణ్ బేడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ట తదితర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోనియా నిర్మాణ్‌భవన్ పోలింగ్ కేంద్రంలో, రాహుల్‌గాంధీ ఔరంగజేబ్ లేన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బిజెపి అభ్యర్థి, అరవింద్ కేజ్రివాల్‌పై పోటీ చేస్తున్న నుపుర్ శర్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను గెలుస్తాననే నమ్మకముందని చెప్పారు.

నీతిబాగ్‌లోని పోలింగ్ కేంద్రంలో కిరణ్ బేడీ ఓటు వేశారు. షర్మిష్ట గ్రేటర్ కౌలాష్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్‌లో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఆయన ఓటు వేయలేదు. రాష్ట్రపతిగా ఉంటూ ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకోలేదు.

కాగా, నరేలా నియోజకజకవర్గంలోని జంగోలా గ్రామ ప్రజలు ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసే వరకు ఓటు వేసేది లేదని అధికారులకు తేల్చి చెప్పారు. పోలింగ్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 714 సమస్యాత్మక, 191 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

English summary
Polling stations have opened in Delhi for state elections billed as the first real test of Indian Prime Minister Narendra Modi's popularity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X