సరిగ్గా ఏడాది: అదే ఢిల్లీ పీఠంపై కేజ్రీవాల్, చీపుర్ల ధరలు పెరిగాయి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఫిబ్రవరి 14వ తేదీకి ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో ఫిబ్రవరి 14వ తేదీన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
2013 డిసెంబర్ 28న కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠం ఎక్కారు. జన్ లోక్ పాల్ బిల్లు విషయంలో ఆయన 49 రోజులకే ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన 2014 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అనంతరం 2015 డిసెంబర్ 7న తిరిగి ఎన్నికలు జరిగి, పదిన ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన 14న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యాధృచ్చికమో.. మరేమో.. కానీ రాజీనామా చేసిన రోజునే ఆయన ప్రమాణం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో చీపుర్ల ధరలు విపరీతంగా పెరిగాయంట. ఒక్కో చీపురు కోసం రూ.150 నుండి ఆ పైన వెచ్చించవలసి వస్తుందంట. ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడంతో.. ఆ పార్టీ గుర్తు అయిన చీపురును ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చేతబట్టి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దుకాణదారులు చీపుర్ల ధరను భారీగా పెంచుతున్నారట.












Click it and Unblock the Notifications