Delhi Exit Polls: ఆప్ ను తక్కువగా అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
Delhi Exit Polls: ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడ్డాయి. ఈ సారి ఢిల్లీలో అధికార మార్పు జరుగుతుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మ్యాట్రిజ్ సర్వే ప్రకారం.. ఢిల్లీలో బీజేపీ, ఆప్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉంటుందని పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం ఆప్ 32-37 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 35-40 సీట్లతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ ఒక సీటును సాధిస్తుందని కూడా ఆ సర్వే తెలిపింది. చాలా వరకు సర్వేలన్నీ బీజేపీకి పట్టం కట్టాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చెబుతున్నాయని.. కానీ ఆప్ ను తక్కువగా అంచనా వేస్తున్నాయని తనకు అనిపించిందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరు ఇంత దారుణంగా ఉంటుందని తాను అనుకోనన్నారు. ఎగ్జిట్ పోల్స్ తో నిరాశ చెందానని సందీప్ దీక్షిత్ పేర్కొన్నారు. దానికి కారణం ఏంటంటే.. కాంగ్రెస్ కు 17-18 శాతం ఓట్లు సులభంగా వస్తున్నాయని తాను భావించానన్నారు. కాంగ్రెస్ ఆ ఓట్లను పొందలేకపోయిందా లేక అంత బలహీనంగా ఉన్నామా అనేది చూడాలన్నారు. ఎగ్జిట్ పోల్స్ కొన్ని సార్లు మాత్రమే నిజమవుతాయని, కొన్ని సార్లు తప్పు కావచ్చని ఆయన అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయని తాను అనుకోనన్నారు. ఓటింగ్ శాతం అంత ఎక్కువగా లేదని.. ఫలితాలు వచ్చిన తర్వాతే అంతా మనకు స్పష్టమవుతుందన్నారు. ఫిబ్రవరి 8న మనకు అసలు విషయం తెలుస్తుందన్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల ఫలితాల చిత్రాన్ని ఇస్తాయి. నిజానికి ఎగ్జిట్ పోల్‌లో ఒక సర్వే నిర్వహించబడుతుంది. దీనిలో ఓటర్లను అనేక ప్రశ్నలు అడుగుతారు. ఎవరికి ఓటు వేశారని అడుగుతారు. ఈ సర్వేను పోలింగ్ రోజున నిర్వహిస్తారు. సర్వే ఏజెన్సీల బృందం పోలింగ్ కేంద్రం బయట ఓటర్లను ప్రశ్నిస్తుంది. దీనిని విశ్లేషించి దీని ఆధారంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తారు. భారతదేశంలో చాలా ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తాయి.
ఢిల్లీలో ఏ సీట్లపై అందరి దృష్టి ఉంది?
ఢిల్లీ ఎన్నికల్లో చాలా సీట్లు ఉన్నాయి. వాటి ఫలితాలపై అందరూ దృష్టి సారిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్, అతిషి, పర్వేశ్ వర్మ, రమేష్ బిధురి, కైలాష్ గెహ్లాట్ వంటి ప్రముఖ నాయకులు రేసులో ఉన్నారు. న్యూఢిల్లీ సీటు విషయంలో అత్యంత ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ పోటీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ మధ్య ఉంది. పట్పర్ గంజ్ స్థానంలో ఆప్ నుంచి అవధ్ ఓజా, బీజేపీ నుంచి రవీందర్ సింగ్ నేగి, కాంగ్రెస్ నుంచి అనిల్ చౌదరి మధ్య పోటీ నెలకొంది. రోహిణి సీటులో ఆప్ నుంచి ప్రదీప్, బీజేపీ నుంచి విజేంద్ర గుప్తా మధ్య హోరాహోరీ ఉండనుంది. కల్కాజీ సీటులో ఢిల్లీ ప్రస్తుత సీఎం అతిషి, మాజీ బీజేపీ ఎంపీ రమేష్ బిదూరి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. జంగ్‌పురా స్థానంలో ఆప్ నుంచి మనీష్ సిసోడియా, బీజేపీ నుంచి సర్దార్ తర్విందర్ సింగ్ మార్వా, కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి బరిలో ఉన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications