ఢిల్లీ వరదలు: యమున మళ్ళీ డేంజర్ బెల్స్; ప్రజలకు ఢిల్లీ సర్కార్ అలెర్ట్!!
దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా యమునా నది నీటిమట్టం తగ్గి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది అనుకున్న సమయంలోనే, మళ్లీ యమునానది యూటర్న్ తీసుకుని యమునా నీటిమట్టం పెరగడం ప్రారంభించింది. యమునానది నీటిమట్టం మళ్ళీ డేంజర్ మార్కును క్రాస్ చేసింది.
Recommended Video

ఢిల్లీలో సోమవారం రాత్రి 11 గంటలకు యమునా నది నీటిమట్టం 206.01 మీటర్లకు చేరుకుందని తెలుస్తుంది. సోమవారం తెల్లవారుజామున యమునా నది నీటిమట్టం 205. 48 మీటర్లు ఉండగా, అది క్రమంగా సోమవారం రాత్రికి మరింత పెరిగింది. దీంతో మళ్లీ యమునానది డేంజర్ బెల్స్ మోగించడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది.

సహాయక శిబిరాల్లో ఉన్నవారు అక్కడే ఉండాలని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సూచించింది. హర్యానా లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవడం వల్ల యమునానది నీటిమట్టం పెరుగుతుందని తెలుస్తుంది .దీంతో సహాయక శిబిరాల్లో నివసిస్తున్న ప్రజలు వరద ప్రభావిత ఇళ్లకు తిరిగి రావద్దని ఢిల్లీ ప్రభుత్వం సూచనలు చేసింది.
ఇదిలా ఉంటే గత రాత్రి 12 గంటల సమయానికి ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి దగ్గర యమునా నది నీటిమట్టం 205. 75 మీటర్లుగా ఉందని సమాచారం. మళ్లీ ఢిల్లీలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇదే సమయంలో సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ ఇలా వరదల్లో చిక్కుకొని అతలాకుతలం అవుతుంటే బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెళ్లడం పైన ఢిల్లీ వాసులు పలువురు సీరియస్ అవుతున్నారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా సీఎం బెంగళూరు టూర్ వెళ్లడం దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు.
అత్యవసర సమయాల్లో ఢిల్లీ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, సహాయ శిబిరాలలో కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకుండా వివక్ష పార్టీల సమావేశానికి వెళ్లడాన్ని బిజెపి నేతలు సైతం తప్పుపడుతున్నారు. సీఎం ప్రజల క్షేమం కోసం పని చేస్తారా లేకా చిల్లర రాజకీయాల కోసం పని చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications