Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిక్కుల్లో ఢిల్లీ సర్కార్: అవసరం కంటే 4 రెట్లు అదనంగా, ఆక్సిజన్ వాడకంపై ఆడిట్ లో షాకింగ్ విషయాలు

కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న సెకండ్ వేవ్ సమయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన దానికంటే నాలుగు రెట్లు అదనంగా ఆక్సిజన్ ను కోరిందని తేల్చింది. ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ సంక్షోభం గరిష్టంగా ఉన్న సమయంలో నగరానికి ఆక్సిజన్ అవసరాన్ని నాలుగు రెట్లు పెంచిందని సుప్రీంకోర్టు ప్యానెల్ తన మధ్యంతర నివేదికలో పేర్కొంది. ఇక ఈ నివేదిక ఢిల్లీ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తుందని అర్ధం అవుతుంది.

Recommended Video

    #TOPNEWS: AP 10th And Inter Exams| Kadtal Farmhouse|Vizag Steel Plant Privatization| Oneindia Telugu
    ఆక్సిజన్ కొరత ఉందని కేంద్రంతో కేజ్రీ సర్కార్ వార్

    ఆక్సిజన్ కొరత ఉందని కేంద్రంతో కేజ్రీ సర్కార్ వార్

    ఏప్రిల్-మే నెలల్లో, ఆక్సిజన్ సరఫరాలో కొరత కారణంగా కోవిడ్ -19 బారినపడిన తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు మరణించారని , ఢిల్లీలోని చాలా ఆసుపత్రులు ఆక్సిజన్ కొరత ఉందని పేర్కొన్నాయి . దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం మరియు కేంద్రం మధ్య మాటల యుద్ధానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు జోక్యంతో, కేంద్రం ఆ నెలల్లో ఢిల్లీ యొక్క ఆక్సిజన్ కేటాయింపును సవరించింది . ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గించడం ద్వారా, ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్న నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా పెంచింది.

    ఆడిట్ నివేదికలో అవసరానికి మించి నాలుగు రేట్లు అదనంగా ఆక్సిజన్ కోరినట్టు వెల్లడి

    ఆడిట్ నివేదికలో అవసరానికి మించి నాలుగు రేట్లు అదనంగా ఆక్సిజన్ కోరినట్టు వెల్లడి

    అయితే ఆడిట్ నివేదిక ప్రకారం, ఢిల్లీకి ఆ సమయంలో సుమారు 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది కానీ ఢిల్లీ ప్రభుత్వం దాదాపు 1200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని డిమాండ్ పెంచింది. ఢిల్లీకి అధిక డిమాండ్ ఉన్నందున, ఇతర రాష్ట్రాల సరఫరాను దేశ రాజధాని ఢిల్లీకి మళ్లించడంతో మరో 12 రాష్ట్రాలు ప్రాణాలను రక్షించే ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవలసి వచ్చిందని ఆక్సిజన్ ఆడిట్ నివేదిక పేర్కొంది. ఆ సమయంలో ఢిల్లీ ఆస్పత్రులలో ఆక్సిజన్ కోసం ఆందోళన వ్యక్తం చేయడంతో, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్ మరియు ఎం.ఆర్ షా 12 మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ పంపిణీ వ్యవస్థపై ప్యానెల్ నుండి ఆడిట్ నివేదికను కోరింది.

    ఢిల్లీలో ఆక్సిజన్ కొరత లేదని తేల్చిన ఆక్సిజన్ టాస్క్ ఫోర్స్

    ఢిల్లీలో ఆక్సిజన్ కొరత లేదని తేల్చిన ఆక్సిజన్ టాస్క్ ఫోర్స్

    మే 13 న, వివిధ ఆసుపత్రులలో ఆక్సిజన్ ట్యాంకర్లను ఆఫ్‌లోడ్ చేయలేమని ఆక్సిజన్ టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఎందుకంటే వాటి ట్యాంకులు అప్పటికే 75% కంటే ఎక్కువ సామర్థ్యంతో ఉన్నాయని, ఎల్‌ఎన్‌జెపి, ఎయిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పూర్తి ట్యాంకులను నివేదించాయని టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. ఏప్రిల్ 29 మరియు మే 10 మధ్య దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ వినియోగం కొన్ని ఆసుపత్రుల రిపోర్టింగ్‌లో లోపాలు కనిపించాయని , వాటిని సరిదిద్దాలని టాస్క్ ఫోర్స్ తెలిపింది.

    ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆక్సిజన్ వినియోగం లెక్క తప్పు ..

    ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆక్సిజన్ వినియోగం లెక్క తప్పు ..

    హాస్పిటల్స్ నివేదించిన వాస్తవ వినియోగం 1140 మెట్రిక్ టన్నులు అని ఢిల్లీ ప్రభుత్వం చూపించింది. తప్పుడు రిపోర్ట్ లను గుర్తించిన ఆడిట్ కమిటీ వాటిని సరిదిద్దాలని సూచించటంతో సదరు ఆస్పత్రులు లోపం సరిదిద్దిన తరువాత, ఆక్సిజన్ అవసరం 289 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఢిల్లీలో ఆక్సిజన్ సద్వినియోగం 284 మెట్రిక్ టన్నుల నుండి 372 మెట్రిక్ టన్నుల మధ్య ఉందని, కానీ నాలుగు రెట్లు అదనంగా ఆక్సిజన్ కావాలని ఢిల్లీ ప్రభుత్వం కోరిందని ఆడిట్ నివేదిక పేర్కొంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+